YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

కొత్త స్కెచ్ లో గులాబీ బాస్‌

Highlights

  • మరోసారి అధికారానికి టీఆర్ఎస్ వ్యూహం
  • కాంగ్రెస్‌ కీలక నేతల  కట్టడికి  రంగం సిద్ధం
 కొత్త స్కెచ్ లో గులాబీ బాస్‌

 తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసిఆర్ వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కొనేందుకు కొత్త స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.  కాంగ్రెస్ పార్టీకి పట్టున్న జిల్లాలుగా గుర్తింపు పొందిన నల్గొండ, మహబూబ్ నగర్  జిల్లాల నేతలను అక్కడే కట్టడి చేయాలని  ప్రణాళికలను రచించినట్లు సమాచారం. మరో సారి అధికారం దక్కించుకునేందుకు  కీలక నేతల నియోజకవర్గాలే టార్గెట్‌గా అధికార పార్టీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది.
మరోసారి రాష్ర్టంలో అధికార పగ్గాలు దక్కించుకునేందుకు సీఎం కేసీఆర్ ఇప్పటి నుంచే ప్రణాళికలను రచిస్తున్నట్లు సమాచారం.  అందుకు అనుగుణంగానే క్షేత్రస్థాయిలో  పరిస్థితులను చక్కబెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.   అభివృద్ధి నినాదంతో  రాబోయే ఎన్నికలకు వెళ్ళే దిశగా గులాబీ పార్టీ అడుగులేస్తోంది.ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలతోపాటు.. కీలక నేతల నియోజకవర్గాలపైనా గులాబీ బాస్ దృష్టి సారించినట్లు సమాచారం.  కాంగ్రెస్‌లోని సీనియర్లు, ముఖ్యనేతలకు చెక్‌ పెట్టేందుకు గులాబీ దళం ప్రయత్నిస్తోంది. జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్, డికే అరుణ, షబ్బీర్ అలీ, రేవంత్ లాంటి నేతలను కట్టడి చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బలమైన నేతల  అనుచరులను టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ నుంచి కారెక్కేందుకు సుముఖంగా ఉన్న వారికి  ప్రాధాన్యతతోపాటు.. పదవులు కూడా కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలో చాలా మందిని కారెక్కించుకున్నారు గులాబీ బాస్‌. కాగా మిగతా నియోజకవర్గాల్లోనూ అదే పంథాను అనుసరించనున్నట్లు సమాచారం.  

Related Posts