YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఎఫ్ 2మూవీ

కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఎఫ్ 2మూవీ

సంక్రాంతి కానుకగా విడుదలైన విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌ల మల్టీ స్టారర్ మూవీ ‘ఎఫ్2’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. గతంలో తరహాలోనే వెంకటేష్ మరోసారి తనదైన కామెడీ మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. ఆయన కామెడీ టైమింగ్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. వరుణ్ తేజ్ సైతం వెంకీతో కలిసి కామెడీ పండించారు. సంక్రాంతి సంబరాల కోసం ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకులకు దర్శకుడు అనిల్ రావిపూడి కామెడీ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్‌ అంటూ అసలు సిసలైన కామెడీ ఎంటర్‌టైనర్‌ను అందించారు. ఓవైపు ‘ఎఫ్2’కలెక్షన్ల వర్షం కురిపిస్తుండగా, మరోవైపు ఈ మూవీ హీరోహీరోయిన్ల పారితోషికంపై చర్చించుకుంటున్నారు. వెంకీ, వరుణ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారన్న టాక్ మొదలైంది. స్టార్ హీరో వెంకటేష్ మూవీ భారాన్ని తన భుజాలపై మోశారని, ఆయన రూ.5 కోట్ల మేర రెమ్యూనరేషన్ అందుకున్నారని ప్రచారం జరుగుతోంది. సినిమా చూసిన ప్రేక్షకులు వెంకీకి ఇంకా ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చినా, వచ్చే నష్టమేం లేదంటున్నారు టాలీవుడ్ ఫ్యాన్స్. మెగా హీరో, వరుణ్ తేజ్ తొలిసారిగా ఓ మల్టీ స్టారర్ మూవీలో నటించారు. గతంలో రెండుసార్లు వెంకటేష్‌ సినిమాలో ఛాన్స్‌లు వచ్చినా చేయడం కుదరలేదు. మూడో ప్రయత్నంలో వెంకీతో నటించిన వరుణ్ తేజ్ ఎఫ్2 మూవీ కోసం రూ.3.5 కోట్లమేర రెమ్యూనరేషన్ తీసుకున్నారని ప్రచారం. మూవీలో వెంకీకి తోడల్లుడుగా నటించాడు

Related Posts