YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సోషల్ మీడియా పర్యవేక్షణ ఫై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు

సోషల్ మీడియా పర్యవేక్షణ ఫై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. దేశంలోని ఏ కంప్యూటర్ ను అయినా.. సోషల్ మీడియానైనా పర్యవేక్షించి సమాచారం తీసుకోవచ్చని కేంద్రం ఇచ్చిన ఆదేశాలకు అడ్డు చెప్పింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.వ్యక్తిగత విషయాలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో.. కంప్యూటర్లలో .. ఎలక్ర్టానిక్ డివైస్ లలో చాలా మంది పంచుకుంటారు. వాటన్నింటిపై కేంద్రం నిఘా పెట్టడం సరికాదని పేర్కొంటూ సుప్రీం కోర్టులో పలువురు పిటీషన్ వేశారు. దీనిపై వాదనలు విన్న సుప్రీం కోర్టు కేంద్రానికి నోటీసులు పంపింది. ఆరువారాల్లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది.దేశంలోని అన్ని కంప్యూటర్లు - ఎలాక్ట్రానిక్ డివైజ్ లపై నిఘా పెట్టి సమాచారం తెలుసుకునే అధికారం కేంద్రంలోని పలు నిఘా సంస్థలకు అప్పగిస్తూ కేంద్రం డిసెంబర్ 20న ఆదేశాలిచ్చింది. దీనిపై పార్లమెంట్ లో విపక్షాలు నిలదీశాయి. దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని పోలీసుల దేశంగా మార్చేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.  అయితే ఇది పాత ఐటీ చట్టమేనని కేంద్రం కవర్ చేసే ప్రయత్నం చేసింది. అయితే కేంద్రం ఇచ్చిన ఆదేశాలు వ్యక్తుల స్వేచ్ఛను హరిస్తున్నాయని గుర్తించిన సుప్రీం కోర్టు తాజాగా రద్దు చేసింది.     

Related Posts