వైకాపా అధినేత జగన్‌తో కేటీఆర్ బృందం రేపు హైదరాబాద్‌లో చర్చలు జరపనుంది. ఫెడరల్ ఫ్రంట్‌లో కలిసి వచ్చే విషయంపై వైకాపాతో చర్చలు జరపాలని తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ నిర్ణయించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు తెరాస నేతలు కేటీఆర్, వినోద్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి తదితరులు జగన్‌తో చర్చలు జరపనున్నారు. కాంగ్రెస్, భాజపాలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.