వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశాల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్ల వద్దకు కార్పొరేట్ కాలేజీల పీఆర్వోలు వెళ్లి విద్యార్థులను చేర్పించే పనిలో నిమగమయ్యారు. ఇప్పుడు సీటు రిజర్వు చేసుకుంటే ఫీజులో రాయితీ ఉంటుందని ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇంకోవైపు కొన్ని బ్రాంచీల్లో తక్కువ సీట్లు ఉంటాయనీ, వాటిలో సీటు కావాలంటే ముందే అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంటుందనీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు విరిస్తున్నారు. దీంతో సీట్లు ఉండవేమోనని భయాందోళనలో ఇప్పటి నుంచి అడ్వాన్స్ చెల్లించి సీట్లు రిజర్వు చేసుకుంటున్నారు.కార్పొరేట్ కాలేజీలు ఇష్టారాజ్యంగా ఫీజుల మోత మోగిస్తున్నాయి. ఏటా ఫీజులు పెంచుతూ విద్యార్థులు, తల్లిదండ్రులపై భారాలు మోపుతున్నాయి. 3 వేల వరకు జూనియర్ కాలేజీలున్నాయి. అందులో ప్రభుత్వ కాలేజీలు, ఎయిడెడ్ కాలేజీలు, గురుకులాలు, మోడల్ కాలేజీలు కలిపి 800 వరకు ఉన్నాయి. ప్రయివేటు జూనియర్ కాలేజీలు 2,200 ఉన్నాయి. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌లో 8 లక్షల మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ కలిపి సుమారు 3 లక్షల మంది విద్యార్థులు ఏటా విద్యనభ్యసిస్తున్నారు. సగటున ఒక్కో విద్యార్థికి రూ.2 లక్షల ఫీజు వసూలు చేస్తారని భావించినా ఏటా రూ.6 వేల కోట్ల విద్యావ్యాపారం జరుగుతున్నది. రాష్ట్రంలో మిగిలిన ప్రయివేటు జూనియర్ కాలేజీల్లో సగటున రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ఫీజు వసూలు చేస్తున్నాయిరాష్ట్రంలో పేరుమోసిన కార్పొరేట్ కాలేజీలు ఏటా 20 శాతం నుంచి 30 శాతం ఫీజులు పెంచుతున్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో కార్పొరేట్ కాలేజీల్లో రెసిడెన్షియల్ సీటుకు రూ.1.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసేవి. ఏసీ తరగతి గదులు, డిజిటల్ తరగతులు, ఎంసెట్, నీట్, జేఈఈ వంటి కోచింగ్‌ల పేరుతో ఇష్టారాజ్యంగా ఫీజులు నిర్ణయించాయి. వచ్చే విద్యాసంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. కాలేజీలకు ఇంకా అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. ఏ కాలేజీకి, ఏ కోర్సుకు అనుబంధ గుర్తింపు వచ్చిందో ఇప్పుడే తెలియదు. అయినా నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి కార్పొరేట్ కాలేజీలు ప్రవేశాల ప్రక్రియను చేపడుతున్నాయి. ప్రవేశాల ప్రక్రియ మొదలు కావడంతో ఫీజుల పెంపు అంశం తెరపైకి వచ్చింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో వసూలు చేసిన దానికంటే మరింత పెంచాయి. రెసిడెన్షియల్‌కు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలు చెల్లించాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. అదే డేస్కాలర్‌కు ఏటా రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ఫీజులు వసూలు చేయాలని ప్రకటించాయి. ఏటా ఫీజులు పెరుగుతుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు పెంచడం, ప్రవేశాల ప్రక్రియ ఇప్పటి నుంచే ప్రారంభిస్తున్నా ఇంటర్ బోర్డు అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. ఆయా కాలేజీలపై చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఫిర్యాదులు వచ్చినా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఫీజులు నియంత్రించాలని ఇంటర్ బోర్డును, రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.వాటిలో సగటున రూ.50 వేల ఫీజు చొప్పున 3.50 లక్షల మంది నుంచి వసూలు చేస్తాయని భావిస్తే, మరో రూ.1,750 కోట్ల వరకు విద్యావ్యాపారం జరుగుతున్నదని అంచనా. దీంతో రాష్ట్రంలోనే ఇంటర్ విద్యలోనే రూ.7,750 కోట్ల వరకు విద్యావ్యాపారం జరుగుతున్నదని ఈ గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటర్ ప్రథమ సంవత్సరానికి ఏటా రూ.1,760, ద్వితీయ సంవత్సరానికి రూ.1,940 వసూలు చేయాల్సి ఉంది. ఈ ట్యూషన్ ఫీజులు 2014-15 విద్యాసంవత్సరం నుంచి పెంచలేదు. ఏటా పది శాతం ఫీజులు పెంచాలని ఉత్తర్వులున్నాయి. కానీ ప్రభుత్వం దాన్ని అమలు చేయడం లేదని ప్రయివేటు కాలేజీ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇంకోవైపు ఇంటర్ బోర్డు నిర్ణయించిన ఫీజులు వసూలు చేయడం లేదని అధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. తెలంగాణ ఆవిర్భవిస్తే కార్పొరేట్ కాలేజీలను ప్రభుత్వం కట్టడి చేస్తుందనీ, ఫీజులు నియంత్రింస్తుందనీ భావించిన వారికి నిరాశే ఎదురవుతున్నది