YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సిటీ శివార్లలలో కోడి పందాలు

సిటీ శివార్లలలో కోడి పందాలు

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఉన్న నాంచారమ్మబస్తీ, మన్సురాబాద్‌, నందనవనం, మునగ నూర్‌, బండ్లగూడ, నాగోల్‌, జవహార్‌ నగర్‌, యాదాద్రి భువనగిరి, అబ్దుల్లాపూర్‌మెట్‌, ఇబ్రహీంపట్నం డివిజన్ల పరిధిలో ఈ కోడి పందాలు ఎక్కువగా నడుస్తాయని తెలుస్తోంది. దానికి తోడు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం చట్టాల కంటే సాంప్రదాయాలకే విలువిస్తున్నారు. ఇక మన తెలంగాణలో మాత్రం వన్యప్రాణ సంరక్షణ చట్టం ప్రకారం ఎవరైన కోడి పందాలు ఆడిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.తెలంగాణ సర్కారు జనవరిలో మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నందున మరో పక్క సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పందెం రాయుళ్లు కోడి పందాలు నిర్వహిస్తారు. దీంతో ముఖ్యంగా పోలీసులు పంచాయతీ ఎన్నికల్లో బిజీగా ఉండటంతో అదే అదునుగా భావించి పందాలు నిర్వహించడానికి పందెం రాయుళ్లు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాచకొండ పోలీసులకు ఇది సవాలుగా మరిందని చెప్పవచ్చు. దీంట్లో ఎవరి పంథం నెగ్గుతుందో వేచి చూడాలి మరి.సంక్రాంతి పండుగను అంటే రైతులు పండించిన పంట ఇంటికి వచ్చిన తర్వాత చాలా సుఖ సంతోషాలతో కుటుంబమంతా ఎంతో ఆనందంగా జరుపుకునేది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సాంప్రదాయాలు వెళ్లువిరిసేళా ప్రతి గడప గడపలో రంగుల ముగ్గులు, గొబ్బెమ్మళ్లతో, గంగిరెద్దులు, సన్నాయి పలకరింపులతో ప్రతి పేదవాడికి సంక్రాతి పండుగ చేసుకునే రోజు నేడు. కుల మతాలకు అతీతంగా, పండుగ జరుపుకుని అల్లుడ్లు, కూతుళ్ల రాకతో నూతన వస్త్రాలతో పండుగ వాతావరణం జరుపుకుంటారు. ఇదే సమయంలో ఇండ్లలో మగ మహారాయుళ్లు మాత్రం సంక్రాంతి పండుగ తమకేమి తీసిపోనట్టు అనుకుని వారు కూడా సంక్రాంతి అంటే కోడిపందెలు అని భావిస్తున్నారు. పందెం కోళ్లకు జీడి, బాదం, పిస్తాలతో నెలల కొద్ది పెంచుతారు. ఆ తర్వాత వాటిని పందెంలో ఆడిస్తు వేలు, లక్షల రూపాయలు చేతులు మారుతుంటాయి. 

Related Posts