Highlights
చంద్రబాబు సవాల్ కు స్పందించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు
బహిరంగ చర్చకు సిద్ధమన్న చంద్రబాబు
టీడీపీతో బహిరంగ చర్చకు సిద్ధం :ఎమ్మెల్సీ సోము వీర్రాజు
చంద్రబాబు సవాల్ కు స్పందించిన వీర్రాజు
బహిరంగ చర్చకు సిద్ధమన్న చంద్రబాబు
కేంద్రం సాయంపై డాక్యుమెంట్ సిద్ధం
కేంద్ర ప్రభుత్వం చేసిన సాయంపై బహిరంగ చర్చ సిద్ధమని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన సవాల్‌పై బీజేపీ నాయకుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందించారు. టీడీపీతో బహిరంగ చర్చకు సిద్ధమేనని ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎప్పుడు చేయనంత సాయం కేంద్రం చేస్తోందని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబును పిలిస్తే లెక్కలన్నీ చెబుతారన్నారు. హరిబాబు సినిమా స్క్రిప్టులు చదువుతారంటూ విమర్శిస్తున్నారని, ఆ అలవాటు మాది కాదు మీదంటూ టీడీపీ నాయకులపై మండిపడ్డారు. అమరావతితో పాటు విజయవాడ అభివృద్ధికి కేంద్రం ఎన్నో నిధులిచ్చిందన్నారు. విశాఖపట్నంలో రోడ్లు మెరవడానికి కేంద్రం నిధులే కారణమని వెల్లడించారు. అమరావతికి రూ. 20 వేల కోట్లతో రోడ్లు నిర్మిస్తున్నామని వివరించారు.
కావాలనే దుష్ప్రచారం..
ఏపీని కేంద్రం అన్నివిధాల ఆదుకుంటోందని, టీడీపీ నాయకులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని కంభంపాటి హరిబాబు అన్నారు. రెవెన్యులోటు పూడ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పార్టీయే పాటుపడుతోందని చెప్పుకొచ్చారు.
కేంద్రం సాయంపై డాక్యుమెంట్
ఆదివారం జరిగిన బీజేపీ విస్తృతస్థాయి సమావేశానికి దగ్గుబాటి పురందేశ్వరి, గోకరాజు రంగరాజు, కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు హాజరయ్యారు. టీడీపీ నేతల విమర్శలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఏపీకి కేంద్రం సాయంపై డాక్యుమెంట్ రూపొందించారు. ఏపీలో ప్రాజెక్టులు, కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను ఇందులో పొందుపర్చారు.