వచ్చే ఎన్నికల్లో ఏపీలో పార్లమెంట్ స్థానాల్లో అత్యధికం వైసిపి ఖాతాలో పడతాయని జాతీయ మీడియా సర్వేలు కొంతకాలం క్రితం ప్రకటించాయి. 25 పార్లమెంట్ స్థానాలు వున్న ఏపీ, తెలంగాణ కన్నా 8 పార్లమెంట్ స్థానాలు అధికమే. బిజెపి, కాంగ్రెస్ వ్యతిరేక కూటమికి దేశవ్యాప్తంగా జట్టుకట్టే పనిలో కెసిఆర్ చాలా సీరియస్ గా తలమునకలైవున్నారు. ఆయన ప్రయత్నాలు కొంతమేర ఫలించాయని యుపిలో మాయావతి, అఖిలేష్ ల కలయిక చాటిచెబుతుంది. యుపి లో అత్యధిక స్థానాలను ఈ రెండు పార్టీలు గెలుచుకుంటే దేశంలో ప్రాంతీయ పార్టీల కూటమి కేంద్ర రాజకీయాలను శాసించే పరిస్థితి ఏర్పడుతుంది కూడా.ములాయం, అఖిలేష్ వంటి భిన్నధ్రువాలే బిజెపి, కాంగ్రెస్ వ్యతిరేకంగా ఒక గూటికి చేరాయి. ఏపీలో బలమైన పక్షంగా వున్న వైసిపి ని థర్డ్ ఫ్రంట్ లో ముందే కలుపుకుని వెళితే తెలుగు రాష్ట్రాలు జాతీయ రాజకీయాల్లో క్రీయాశీలకం అవుతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 42 అసెంబ్లీ స్థానాలతో బలంగా ఒకప్పుడు ఉండేది. రాష్ట్రం విడిపోయాకా తెలుగురాష్ట్రాలు విడివిడిగా ఉంటే కేంద్ర రాజకీయాల్లో పెద్దగా ప్రాముఖ్యత లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో థర్డ్ ఫ్రంట్ స్టీరింగ్ తిప్పుతున్న కెసిఆర్ జగన్ తో మాటామంతి కలిపి ఒక్కటై ఎన్నికల తరువాత ముందుకు సాగాలని నిర్ణయించారు.తిరుగులేని వ్యూహాలకు పెట్టింది పేరైన కెసిఆర్ థర్డ్ ఫ్రంట్ కి మద్ధత్తు కోరుతూ వైసిపిని కలుపుకుని వెళ్లాలన్న నిర్ణయం తీసుకున్న వెంటనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, సీనియర్ నేతలు వినోద్, పల్లా రాజేశ్వర రెడ్డి, శ్రవణ్ కుమార్ లతో కూడిన టీం కి ఈ బాధ్యతలు అప్పగించారు. వీరంతా హైదరాబాద్ లో ఉన్న వైఎస్ జగన్ తో భేటీ కానున్నారు. థర్డ్ ఫ్రంట్ లోకి వైసిపి రావాలన్న కేసీఆర్ ఆహ్వానం అందించనున్నారు.కే ప్రత్యేక హోదాకోసం గులాబీ పార్టీ మద్దతు ప్రకటించిన నేపథ్యంలోనూ, శత్రువుకి శత్రువు మిత్రుడే అన్న పాలసీలో వైసిపి టిఆర్ఎస్ తో జట్టు కట్టడం లాంఛనమే కావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే టి నేతల భేటీ అనంతరం సీనియర్ నేతలతో చర్చించి జగన్ కెసిఆర్ ను కలిసే అవకాశం ఉందని వైసిపి పార్టీ లో ప్రచారం సాగుతుంది. తాజా పరిణామాలను గమినించే టిడిపి అధినేత చంద్రబాబు ఏపీ విలన్ల జాబితాలో మోడీ జగన్ లతో బాటు కెసిఆర్ ను చేర్చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.