YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

యూపీలో త్రిముఖ పోటీ..

యూపీలో త్రిముఖ పోటీ..

ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో నేల చూపులు చూసిన బీజేపీ.. తమ తప్పులు సరిదిద్దుకోవాలనే కోణంలో అడుగులు వేస్తోంది. కొత్త స్కీముల ఆశ చూపి ఓటర్లకు వల వేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే మరోవైపు బీజేపీ యేతర పార్టీలు.. ఈ సారి ఎలాగైనా కమలాన్ని పాతాళంలోకి నెట్టేయాలని దృఢ సంకల్పంతో ముందుకెళుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఎంతో కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలు హాట్ టాపిక్ అవుతున్నాయి. 

యూపీలో బీజేపీ పరిస్థితి పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతోంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభావం ఏ మాత్రం ఉండదని ఫిక్స్ అయ్యాయి అక్కడి రాజకీయ వర్గాలు. యూపీ మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీ లేదని తెలిసి బీజేపీ నేతలు అంతర్గతంగా సంబర పడుతున్నారు కానీ.. అది వారికే నష్టం అని తెలుసుకోలేక పోతున్నారు. ఎస్పీ, బీఎస్పీ జత కట్టడంతో ఇక బీజేపీ పనై పోయినట్లే అని అంచనాకు వచ్చేశారంతా. యూపీలో వాస్తవ పరిస్థితులు చూస్తే..  దళితుల మద్దతు బీఎస్పీకి ఉంటే.. బీసీ వర్గాలు, ముస్లింల మద్దతు సమాజ్ వాదీ పార్టీకి ఉంది. కొంతవరకు అగ్రవర్ణాల మద్దతు కమలానికి ఉంది. అందులో కొందరు అగ్ర వర్ణాలు కాంగ్రెస్ వైపే ఉన్నారు. అలాగే కొందరు ముస్లిం ఓటర్లు కూడా కాంగ్రెస్‌కే మద్దతు చెబుతారన్న ప్రచారం ఉంది. ఇక.. ఎస్పీ, బీఎస్పీ పొత్తులు పెట్టుకుంటే ఓట్ల బదిలీ జరుగుతుందని ఉపఎన్నికల్లో తేలింది. కానీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల అభ్యర్థులను నిలబెడితే మాత్రం ఆ పార్టీకి.. ఎస్పీ, బీఎస్పీ ఓటర్లు ఓట్లు వేస్తారన్న గ్యారంటీ లేదు. అలాగే కాంగ్రెస్ ఓటర్లు కూడా ఎస్పీ, బీఎస్పీ కూటమికి ఓటేయడం అనుమానకరమే. కాంగ్రెస్ పార్టీ చేయించిన సర్వేల్లోనూ అదే తేలడంతో కాంగ్రెస్ పార్టీ కూడా.. పొత్తుల కోసం ముందడుగు వేయలేదు. కాంగ్రెస్ పార్టీ విడిగా బరిలో దిగటం వల్లే బీజేపీకి వెళ్లాల్సిన కొంత శాతం ఓట్లయినా కాంగ్రెస్ పార్టీకి పడతాయనే అంచనాకు వచ్చారు.  కాంగ్రెస్ పార్టీ పొత్తులో లేకపోయినా.. ఓట్ల పరంగా అది బీజేపీకే నష్టం. ఈ లెక్కలు తెలియక బీజేపీ శ్రేణులు సంబర పడ్డారు. కానీ తాజా పరిస్థితులు చూసి కమలం పార్టీలో వణుకు పుడుతోందట. పొత్తులో కాంగ్రెస్ లేదని తాము పడుతున్న సంబరాల్లో ఏ మాత్రం అర్థం పర్థం లేదని వారిలో వారే చెప్పుకుంటున్నారట. ఎస్పీ, బీఎస్పీ పొత్తు ఒకరకమైన టెన్షన్ పుట్టిస్తుంటే.. ఉన్న ఓట్లను కూడా కాంగ్రెస్ పార్టీ చీల్చుకు పోతుందేమోనని కంగారు మొదలైందట బీజేపీ వర్గాల్లో. చూడాలి మరి యూపీ ఎన్నికలు ఎలాంటి ఫలితాలిస్తాయో!

Related Posts