వ్యక్తిత్వ హననంలో చంద్రబాబు దిట్ట.చంద్రబాబు నాయకత్వంలోని టిడిపి పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోంది. వైయస్ షర్మిలపై దుష్ర్పచారం భాధాకరమని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ కుర్చీ లాక్కోవడానికి ఆయన వ్యక్తిత్వాన్నే చంద్రబాబు ఎంతగా హననం చేశారో అందరికి తెలుసు. నీచమైన స్వభావం కలిగిన వ్యక్తి చంద్రబాబు.రాజకీయలబ్ది కోసం చంద్రబాబు ఏదైనా చేస్తారు.రాజకీయప్రత్యర్దుల వ్యక్తిత్వాల్ని దెబ్బతీసేందుకు చంద్రబాబు యధాశక్తి ప్రయత్నిస్తుంటారని విమర్శించారు. గతంలో కూడ షర్మిలపై సోషల్ మీడియాలో అపవాదులు వేసి ప్రచారం చేశారు. నీచమైన స్వభావం కలిగిన చంద్రబాబు వ్యక్తిత్వ హననంకు పాల్పడుతున్నారు. ఈ విషయాలను ప్రజలందరూ తెలుసుకోవాలి. ఫెడరల్ ఫ్రంట్ అని కేసిఆర్ మాకు కబురు చేసి దానిపై చర్చించేందుకు కేటిఆర్ ను మరికొందర్ని పంపారు. జగన్ నివాసంలో జరిగిన పరిణామాలు శుభపరిణామంగా భావిస్తున్నాను. జగన్ వారితో చర్చలు జరిపారు. టిడిపి నేతలు కుక్కల్లా మొరగడం స్టార్ట్ చేశారు. కేసిఆర్ గాని టిఆర్ ఎస్ గాని ఆంధ్రాలో పోటీ చేయడంలేదు. పార్లమెంట్ కు సంభందించి తెలంగాణాలో కొన్ని సీట్లు వారికున్నాయి,ఆంధ్రాలో మాకు కొన్ని సీట్లు ఉన్నాయి. పార్లమెంట్ లో 42 సీట్లు ఉన్న రాష్ర్టాలు కేంద్రంపై వత్తిడి తేవడం ద్వారా రాష్ర్టానికి రావాల్సిన నిధులను రాబట్టవచ్చని మా ఆలోచన అని అయన అన్నారు.