Highlights
- మోడీ పేరెత్తడానికి కూడా బాబుకు భయం
ప్రధాని నరేంద్ర మోడీ పేరు ఎత్తడానికి కూడా చంద్రబాబుకు భయంగా ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి అన్నారు. బడ్జెట్ వచ్చి న17 రోజుల తరువాత సీఎం చంద్రబాబు మాట్లాడారని, అయితే తన ప్రసంగంలో మోడీ పేరు ఎత్తడానికి భయపడ్డారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని నిలదీసే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదని విమర్శించారు. ఎవరిపై పోరాటం చేస్తారో ప్రజలకు స్పష్టం చేయాలని చంద్రబాబుకు సూచించారు. నాలుగేళ్లుగా ఏపీకి అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు చూస్తూ ఊరుకున్నారని విమర్శించారు. చట్ట సభలో ఇచ్చిన హామీలను కేంద్రానికి తాకట్టు పెట్టారని మండిపడ్డారు.