కనుమ పండుగను నారా, నందమూరి కుటుసభ్యులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. బుధవారం పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ట్రాక్టర్ నడిపారు. తనయుడు దేవాంశ్, మామ నందమూరి బాలకృష్ణలు ట్రక్కులో నిలుచుని రాగా, లోకేష్ ట్రాక్టర్ నడుపుతూ ముందుకు సాగారు. అనంతరం తనను చూసేందుకు వచ్చిన ప్రజలను పలకరించి వినతులు స్వీకరించారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులు, కార్యకర్తలతో ఫోటోలు దిగారు. అంతా స్వగ్రామాలకు చేరుకుని ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.