YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఈనెల 18 న ఎన్టీయార్ విగ్రహం ఆవిష్కరణ

ఈనెల 18 న ఎన్టీయార్ విగ్రహం ఆవిష్కరణ

దివంగత ఎన్టీయార్ యుగ పురుషుడు. తెలుగుజాతి ఉన్నంతకాలం ఆయన పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ఈ నెల 18 అన్న ఎన్టీయార్ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళిగా సత్తెనపల్లి పట్టణంలో రాష్ట్రంలో పెద్దదైన ఎన్టీయార్ విగ్రహన్ని సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించడం జరుగుతుందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీయర్  వర్థంతికి ప్రతి సంవత్సరం అన్నదానం, రక్త దానం వంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అన్న ఎన్టీయార్ పెట్టిన సంక్షేమ పధకాలే దేశంలో ఎక్కువ ప్రభుత్వాలు నేటికి అమలు చేయడం జరుగుతుంది. సత్తెనపల్లిలో విశాలమైన చెరువులో అన్న ఎన్టీయార్ విగ్రహం ఏర్పాటు చేయాలని తలంపుతో ఈ ప్రాజెక్టు చేయడం జరిగింది. గతంలో మురికి కూపంలాగా ఉన్న ఆ చెరువును మరమ్మతులు చేసి 40అడుగుల పీఠంపై 36అడుగుల ఎన్టీయార్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది.అలాగే చెరువులో ఎనిమిది అడుగుల నీటిని నింపడం జరుగుతుంది. ఆ విగ్రహం చూడడానికి విగ్రహం దగ్గర గ్యాలరీ ఏర్పాటు చేయడం జరుగింది. అక్కడ బోటింగ్ ఏర్పాటు చేసి పర్యాటకంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. అక్కడ చెరువు వాకింగ్ ట్రాక్ పై నిత్యం వేల మంది వాకింగ్ వస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు తారకరామా సాగర్ అని పేరు పెట్టడం జరిగింది. అక్కడ 7ఎకరాల విస్తీర్ణంలో పార్క్, వావిలాల ఘాట్ ఏర్పాటు చేయడం జరిగింది. పార్క్ లో యాంపి దియేటర్, చిల్డన్ పార్కు ఏర్పాటు చేయడం జరిగిందని అయన వెల్లడించారు. ఈ యాంపి దియేటర్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. గతంలో మురికివాడలా ఉన్న ప్రాంతాన్ని ఈ రోజు ఎన్టీయార్ గార్డెన్స్ గా తీర్చిదిద్దాం. ఈ ప్రాంతం మొత్తం అన్న ఎన్టీయార్ నివాళిగా సుందరమైన పర్యటక కేంద్రంగా ఏర్పాటు చేశాం. గతంలో వెనుకబడిన సత్తెనపల్లి నియోజకవర్గం నేడు అభివృద్ధి పధంలో ముందుకు తీసుకెళ్లడం జరిగుతుంది. సీఎం చంద్రబాబు, సీఆర్డీఏ సహకారంతో ఈ అభివృద్ధి చేయడం జరిగింది. సత్తెనపల్లి ప్రజల ఆకాంక్ష మేరకు ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనిని జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలపై ఉంది. 18న సీఎం చంద్రబాబు  ఉదయం 10గంటలకు ఎన్టీయార్ విగ్రహం, పార్క్ ను ప్రారంభించనున్నారు. ఎన్టీయార్ స్పూర్తితో నాలాంటి లక్షల మంది రాజకీయాల్లోకి వచ్చారు. వీటితో పాటు 35కోట్లతో కేంద్రీయ విద్యాలయ భవనాలు ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే సత్తెనపల్లి అచ్చంపేట 90కోట్లతో రైల్వే అండర్ బిడ్జీ కి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. కోడమోడు నుండి పేరెచర్ల వరకూ రోడ్డు పూర్తియితే సత్తెనపల్లి జీవనరేఖ మారిపోయిందని అయన అన్నారు. 

Related Posts