YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బెజవాడ రైల్వే జంక్షన్‌ 'ప్రైవేట్‌'పరం..?

Highlights

  • ఏకంగా 45 నుంచి 99 ఏళ్లపాటు లీజు
  • దాదాపు 22 ఎకరాలకుపైగా స్థలం
  • ఏడాదికి 175 కోట్ల రూపాయలకుపైగా ఆదాయం
  • 370కుపైగా రైళ్లలో ప్రయాణీకుల రాకపోకలు
  • ప్రభుత్వ ఆధీనంలోనే రైల్వేశాఖను అభివృద్ధి చేయాలి 
  • రైల్వేయూనియన్ నేతలు
బెజవాడ రైల్వే జంక్షన్‌ 'ప్రైవేట్‌'పరం..?

ఎన్నో పేరు ప్రఖ్యాతులు సాధించిన విజయవాడ రైల్వే జంక్షన్‌ ప్రైవేట్‌పరం కాబోతోంది. ఇందుకోసం చర్యలు ఊపందుకున్నాయి. దేశంలోనే అతిపెద్ద రైల్వే జంక్షన్‌లలో విజయవాడ రైల్వే స్టేషన్‌ ఒకటి. ఏడాదికి 175 కోట్ల రూపాయలకుపైగా ఆదాయం, 70 ప్యాసింజర్‌ రైళ్లు, 250 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, మొత్తం 370కుపైగా రైళ్లలో నిత్యం లక్షల సంఖ్యలో ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తుంటారు. ఎన్నో పేరు ప్రఖ్యాతులు సాధించిన విజయవాడ రైల్వే జంక్షన్‌ ప్రైవేట్‌పరం కాబోతోంది. ఇందుకోసం చర్యలు ఊపందుకున్నాయి. ఇప్పటికే రైల్వేస్టేషన్‌ బేరానికి ప్రైవేట్‌ కంపెనీలు టెండర్‌కు సిద్ధమయ్యాయి. ఒకటికాదు.. రెండుకాదు... ఏకంగా 45 నుంచి 99 ఏళ్లపాటు లీజుకివ్వాలంటూ దక్షిణ మధ్య రైల్వేకు డెడ్‌లైన్‌ విధించాయి. బెజవాడ రైల్వే జంక్షన్‌ను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టడం వెనుక పెద్ద వ్యూహమే అమలు చేస్తున్నారు.

దాదాపు 22 ఎకరాలకుపైగా స్థలం
విజయవాడ రైల్వేస్టేషన్‌కు పరిసరాలు, ఫ్లాట్‌ఫామ్‌లు అన్నీ కలిపి దాదాపు 22 ఎకరాలకుపైగా స్థలం ఉంది. దీని అంచనా విలువ దాదాపు 200 కోట్ల రూపాయలు. ఇందులో ప్రపంచస్థాయిలో సదుపాయాలు కల్పిస్తామంటూ రైల్వేశాఖ చెబుతోంది. మరోవైపు ప్రైవేట్‌పరం చేసేందుకు చర్యలు ముమ్మరం అయ్యాయి. ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి రైల్వేస్టేషన్‌ వెళితే ఆజమాయిషీ ఉండదు. గతంలోనే ఆయా ప్రైవేట్‌ కంపెనీలకు 45 ఏళ్లపాటు లీజుకు అప్పగించాలని 2017లోనే ప్రతిపాదించారు. కానీ 99 ఏళ్లపాటు లీజుకు ఇస్తేనే టెండర్లు ఆహ్వానిస్తామని కంపెనీలు రైల్వేకు అల్టిమేటం ఇచ్చాయి.

వాస్తవానికి రైల్వేల్లో ప్రైవేట్‌ పెట్టుబడులు ఆహ్వానించేందుకు రైల్వే మంత్రిత్వశాఖ 2017 ప్రారంభంలోనే రీ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు నిర్ణయించింది. రైల్వేస్టేషన్లను ప్రైవేట్‌కు అప్పగించడం ద్వారా నాన్‌టిక్కెట్‌ రెవెన్యూ కింద లక్ష కోట్లు ఆర్జించాలని చూస్తోంది. ఇందుకోసం దేశంలో మొత్తం 23 స్టేషన్లు ఎంపిక చేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లు తొలి ప్రాతిపదికన ఎంచుకున్నారు. ఈ రెండు స్టేషన్లను రీ డెవలప్‌మెంట్‌ కింద ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు నిర్ణయించారు. రైల్వేస్టేషన్‌లోని కమర్షియల్‌ స్థలంతోపాటు రైల్వేకు చెందిన ఖాళీ స్థలాలను 45 ఏళ్లపాటు ప్రైవేట్‌కు లీజుకు అప్పగిస్తారు.

ప్రభుత్వ ఆధీనంలోనే రైల్వేశాఖను అభివృద్ధి చేయాలి 
విజయవాడ రైల్వేస్టేషన్ ను ప్రైవేట్ కు అప్పగించడాన్ని రైల్వేయూనియన్ నేతలు, సిబ్బంది, కార్మికులు, విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అభివృద్ధి పేరుతో రైల్వేస్టేషన్లను ప్రైవేట్‌కు ఇవ్వడమంటే అందులోపనిచేస్తున్న వారిని దగా చేయడమేనని నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఆధీనంలోనే రైల్వేశాఖను అభివృద్ధి చేయాలని సీపీఎం నేతలు కోరుతున్నారు.మొత్తానికి విజయవాడ రైల్వేస్టేషన్‌ ప్రైవేట్‌పరం చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై రైల్వేశాఖ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.

Related Posts