YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రధాని పీఠంపై బెహన్ జీ కన్ను

ప్రధాని పీఠంపై బెహన్ జీ కన్ను

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి పూర్తి క్లారిటీతో ఉన్నట్లున్నారు. ఇటు కాంగ్రెస్ ను, భారతీయ జనతా పార్టీని దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రత్యామ్నాయం తానేనని మాయావతి పూర్తి విశ్వాసంతో కన్పిస్తున్నారు. పుట్టినరోజు వేడుకల సందర్బంగా మాయావతి చేసిన వ్యాఖ్యలే దీనికి అద్దంపడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్, మాయావతి పొత్తును సమర్థించుకోవడమే కాకుండా కాంగ్రెస్ ను పక్కనపెట్టడాన్ని కూడా మాయావతి ఏమాత్రం తప్పుపట్టలేదు.ఇందుకు ఆమె ఉదాహరణలు కూడా వివరించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించిన విధానాన్ని ఆమె తప్పుపట్టారు. యూపీలో కాంగ్రెస్ ను పక్కన పెట్టడానికి ఆ రాష్ట్ర ఎన్నికలే కారణమని ఆమె చెప్పకనే చెప్పారు. ఆ మూడు రాష్ట్రాల ఎన్నికల్లో మాయావతి కాంగ్రెస్ తో పొత్తు కోసం ప్రయత్నించినా స్థానిక కాంగ్రెస్ నేతలు అంగీకరించలేదు. హస్తం పార్టీ హైకమాండ్ కూడా వారికే వంత పాడింది. దీంతో మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీఎస్పీ విడిగానే పోటీ చేయాల్సి వచ్చింది.మూడు రాష్ట్రాల ఎన్నికల్లో తమకు జరిగిన అవమానాన్ని మాయావతి ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. తమకు బలం లేని చోట దేశవ్యాప్తంగా బీఎస్పీని బలహీనంగా చూపిన కాంగ్రెస్ కు తమ సత్తా చూపించాలనే బీఎస్పీ, ఎస్పీలను కలిశాయన్నది మాయావతి మాటల అంతరార్థం. ఉత్తరప్రదేశ్ లో రెండు పార్టీలు కలిసి 70 స్థానాలను సాధించగలిగితే ప్రధాన మంత్రి పదవి తన పరం అవుతుందని మాయావతి గట్టిగా నమ్ముతున్నారు. మాయావతి ప్రధాని అభ్యర్థి ఎన్నికల అనంతరమే నిర్ణయిస్తామని చెప్పడం ఇందులోని సారాంశమంటున్నారు. అఖిలేష్ యాదవ్ అండతో ప్రధాని పీఠం ఎక్కాలన్నది ఆమె లక్ష్యం. ఇప్పుడిప్పుడే బీజేపీ, కాంగ్రెస్ యేతర ఫ్రంట్ కు పునాదులు పడుతున్న నేపథ్యంలో మాయావతి ప్రధాని అభ్యర్థిగా తాను ముందు వరసలో ఉంటానని ఆమె చెప్పకనే చెప్పారు. మొత్తం మీద మాయావతి మాటలను బట్టి మూడు రాష్ట్రాల ఎన్నికలే కాంగ్రెస్ కు యూపీలో చోటు లేకుండా చేశారన్నది స్పష్టంగా తెలుస్తోంది.

Related Posts