తూర్పుగోదావరి జిల్లా మండలకేంద్రం కరపలోని కంచిరాజు నగర్ లో బుధవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన లో 5 తాటాకిళ్ళు ఆగ్నికి ఆహుతయ్యాయి. కరెంటు షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి మంటలు వ్యాపించడంతో కోలని వారు భయంతో బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే ఐదిళ్లు కాలి బుడిదయ్యాయి. అదృష్టవశాత్తూ ఆ ఇళ్లలో ఒక వ్యక్తి మాత్రమే ఉండగా, మిగతా వారు తాళాలు వేసి ఊరికి వెళ్లారు. ఆ వ్యక్తిని స్థానికులు కాపాడారు. సమాచారం తెలిసిన వెంటనే మాజీ సర్పంచ్ పొలిశెట్టి తాతిలు, బ్రాహ్మణ కార్పొరేషన్ డిఎల్ ఓ డిహెచ్ వి సాంబశివరావులు అక్కడకు చేరుకున్నారు. సమాచారాన్ని తహశీల్దార్ బూసి శ్రీదేవి ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మీ సత్తిబాబుకు తెలియచేసారు. పాములు పట్టి జీవించే ముత్యాలు అనే వ్యక్తి ఇంట్లో రూ 5 వేలు నగదుతోపాటు 5 పాములు మంటల్లో కాలి చనిపోయాయి. ప్రమాదంతో 5 కుటుంబాలకు చెందిన 13 మంది వీధిన పడ్డారు. దాదాపు 5 లక్షలు ఆస్తి నష్టం వాటిల్లి ఉండవచ్చు అని అంచనా.