ప్రధాని మోడీ డైరెక్షన్లో కేసీఆర్, జగన్ నటిస్తున్నారు. కేసుల మాఫీ కోసం జగన్, భారీ స్కాంలు కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పుల్లారావు ఆరోపించారు. గురువారం అయన చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడారు. కేటీఆర్, జగన్ నిన్న మోడీపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేసీఆర్, జగన్ మోడీకి కీలు బొమ్మలుగా మారారు. మోడీ వ్యతిరేక ఓట్లను చీల్చే కుట్రలో భాగమే ఫెడరల్ ఫ్రంట్ నాటకమని అయన అన్నారు. కాంగ్రెస్ భాగస్వామ్యం లేకుండా మోడీ ప్రభుత్వానికి ప్రత్యామ్నయ ప్రభుత్వం 2019లో కేంద్రంలో ఏర్పడటం సాధ్యం కాదు. నిన్నటితో మోడీ, కేసీఆర్, జగన్ ముసుగు తొలగింది. జగన్కు ఇప్పుడున్న 5 ఎంపీలు కూడా 2019 ఎన్నికల్లో నిలబడే పరిస్థితి లేదని అయన అన్నారు. లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్కు మైనార్టీ, దళితులు, బీసీలు ఓట్లు వేయరు. జగన్, కేటీఆర్, భేటీలను, కుట్రలను ఆంధ్రులు బలంగా తిప్పికొడతారు. కేసీఆర్, మోడీ ఇచ్చే మూటలకు జగన్ కక్కుర్తిపడి ఆంధ్రా ద్రోహిగా నేటు బట్టబయలయ్యారు. కోడికత్తి కేసును కేంద్రంను చేపట్టడం జగన్-మోడీ లాలూచీకి రుజువు కాదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు బహిరంగ ప్రకటన చేసిన కాంగ్రెస్ను కాదని జగన్..కేసీఆర్, మోడీ వంచన చేరారు. రాఫెల్ యుద్ద విమానాల కొనుగోళ్లలో మోడీ ప్రభుత్వ అవినీతిని ఖండించకపోవడం జగన్-మోడీ లాలూచీకి నిదర్శనం కదా మంత్రి అన్నారు. రాయలసీమ ప్రాణాధారమైన పోతిరెడ్డిపాడుపై విషం కక్కిన కేసీఆర్తో జగన్ చేత్లు కలపడం ఆంధ్రా ద్రోహం కాదా?. షరతులు లేకుండా కేసీఆర్ ప్రత్యేక హోదాకు మద్దతు ప్రకటించగలడా? రాష్ట్ర ప్రజలు 25 ఎంపీ స్థానాలను టీడీపిని గెలిపిస్తారని అన్నారు.