అండమాన్ నికోబార్‌లో భూకంపం సంభవించింది. నికోబార్ ద్వీపాల్లో గురువారం ఉదయం సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 6.0గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ వెల్లడించింది. ఉదయం 8.43 సమయంలో భూమి కంపించినట్లు తెలిపింది. నికోబార్ ద్వీపాల ప్రాంతంలో బంగాళాఖాతం సముద్రంలో 84కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు గుర్తించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఆస్తి, ప్రాణ నష్టం గురించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.