YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

దోపిడీకి గురవుతున్న హెచ్‌-1బీ వీసాదారులు థింక్‌-ట్యాంక్‌ సంస్థ వెల్లడి

దోపిడీకి గురవుతున్న హెచ్‌-1బీ వీసాదారులు                 థింక్‌-ట్యాంక్‌ సంస్థ వెల్లడి

అమెరికాలో హెచ్‌-1బీ వీసాలపై పనిచేస్తున్న ఉద్యోగులకు చాలా సార్లు పని వాతావరణం ఏమాత్రం బాగుండట్లేదని, వేధింపులకు గురవుతున్నారని, పనికి తగిన వేతనం ఇవ్వకుండా దోపిడీ చేస్తున్నారని  సౌత్‌ ఏషియన్‌ సెంటర్‌ ఆఫ్‌ ది అట్లాంటిక్‌ కౌన్సిల్‌ (థింక్‌-ట్యాంక్‌) అనే సంస్థ పేర్కొంది. ఈ ఉద్యోగాల  విషయంలో.. జీతాల పెంపుతో పాటు పలు సంస్కరణలు తీసుకురావాలని సూచించింది. ఈ వీసాలపై పనిచేసే వారికి మంచి పని వాతావరణం, ఉద్యోగ హక్కులు కల్పించాలని పేర్కొంది. హెచ్‌-1బీ వీసా విధానంలో మార్పులు తీసుకొస్తామని, మంచి సంస్కరణలు చేస్తామని, ప్రతిభావంతులు అమెరికాలో ఉండేందుకు మార్గం సుగమం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఈ సంస్థ ఉద్యోగ పరిస్థితులను చాలా మెరుగు పరచాలంటూ నివేదిక విడుదల చేసింది.ప్రస్తుతం ఉన్న హెచ్‌-1బీ వీసా విధానం వల్ల అమెరికన్లకు హానీ జరగడంతో పాటు.. హెచ్‌-1బీ వీసాదారులు దోపిడీకి, వేధింపులకు గురవుతున్నారని, తగిన వేతనం ఇవ్వకుండా పని చేయించుకుంటున్నారని నివేదిక వెల్లడించింది. వారికి తగిన వేతనంతో పాటు చక్కని పని వాతావరణం, ఉద్యోగ హక్కులు కల్పిస్తే ఇక్కడ వారి జీవితాలు మెరుగవుతాయని పేర్కొంది. ఈ వీసాల విషయంలో మొదట చేయాల్సిన పని జీతాలు పెంచడం అని తెలిపింది. అప్పుడే అత్యుత్తమ ప్రతిభావంతులు అమెరికాకు వస్తారని వెల్లడించింది. కంపెనీలు అమెరికన్లను కూడా తగినన్ని ఉద్యోగాలు ఇవ్వాలని, అర్హతను బట్టి పదవులు ఇవ్వాలని తెలిపింది.

Related Posts