బిసి ల ద్రోహి కేసీఆర్ తో కలిసి జగన్ రాష్ట్రంలోని బిసిలకు ద్రోహం చేస్తున్నారు. మంత్రి పదవి కోసం తలసాని రాష్ట్రంలో బిసి లపై లేని ప్రేమ చూపిస్తున్నారు. తెలంగాణ లో 26 కులాల బిసిలకు అన్యాయం చేస్తుంటే తలసాని ఏం చేస్తున్నారని ఏపీ మహిళా ఆర్థికాభివృద్ధి సంస్థ ఛైర్ పర్సన్, టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ లో బిసిల కు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించే దమ్ము తలసాని కి ఉందా? తలసాని రాష్ట్ర పర్యటన,కేటీఆర్ జగన్ తో భేటి చూస్తుంటే బిసి మధ్య రాష్ట్రంలో చిచ్చు పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ ,జగన్ రాష్ట్రానికి తాచు పాముల తయారయ్యారు. మీ ఆటలు రాష్ట్రంలో సాగవు,తలసాని లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చిన ఏమి చెయ్యలేరు. దమ్ముంటే నేరుగా రండి దేవాలయాల పేరుతో రావడం ఎందుకు. లోటు బడ్జెట్ ఉన్నా రాష్ట్రంలో బిసి లకు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేస్తున్నారు. గతంలో అవిశ్వాసం పెడితే మద్దతు పలకని వారు ఇవాళ హోదా కోసం పోరాడతామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. సంవత్సరం క్రితం పోలవరం పై కవిత కేస్ పెట్టింది నిజం కాదా? జగన్ సొంత జిల్లాలో ఉక్కు కర్మాగారం కావాలని మీ సొంత పత్రిక ఏనాడైనా వార్త రాసారా? ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగింది ఒక్క చంద్రబాబు మాత్రమేనని అన్నారు. పెన్షన్ పెంచిన అంశంపై దృష్టి మరల్చడానికి షర్మిల అనే బాణాన్ని వదిలారు. చంద్రబాబు ఇప్పుడు ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడలేదు,పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా దూషించింది జగన్ మోహన్. విజయసాయి రెడ్డి రాష్ట్రానికి పట్టిన దరిద్రం ,తిరుమల నగలు చంద్రబాబు ఇంట్లో ఉన్నాయని అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. తెదేపా మహిళా శాసన సభ్యులపై సామాజిక మాధ్యమల్లో అనుచితంగా వ్యాఖ్యలు చేయలేదా. పెన్షన్ పెంచారని ,ఆక్రోశంతో దృష్టి మరల్చే ప్రయత్నం షర్మిల చేసారని ఆమె విమర్శించారు.