YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ కు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు

జగన్ కు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు

రాష్ట్ర ప్రతి పక్ష నాయకునికి వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు. ఇప్పటికే ఎమ్మెల్యే  టికెట్ కి 30 కోట్లు, ఎంపీ టికెట్ కి వంద కోట్లు డిమాండ్ చేస్తున్నారు. మరలా డబ్బుకోసం సీమాంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసిన తెరాస తో వైసీపీ కలుస్తుందని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసీ రెడ్డి ఆరోపించారు. గురువారం అయన మీడియాతోమాట్లాడారు. రాజశేఖర్ రెడ్డి నీటి దొంగ అని పోతిరెడ్డి పాడు కి కన్నం బెట్టి తెలంగాణ కి రావాల్సిన నీటిని ఎత్తుకెళ్లాడు అందుకే పావురాళ్ల గుట్టలో పావురం అయ్యాడు అని కేసీఆర్ అన్నాడు. ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడిన పార్టీ తెరాస  పార్టీ. తెలంగాణ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకుండా తెరాస గెలిస్తే మిఠాయిలు పంచుకున్నారు. జగన్, కెటిఆర్ భేటీ వైసీపీకి  భంగపాటు తప్ప మరేం లేదని అయన వ్యాఖ్యానించారు. వైస్సార్సీపీ అని పార్టీ పేరు తీసేసి ఏపీ తెరాస అని పెడతారేమో అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రత్యేక హోదాలో నిజం లేదు. తెరాస,  వైసీపీ కలయిక ద్వారా  500 కోట్లు డబ్బు  జగన్ కి ,సీఎం పదవి చంద్రబాబుకి గిఫ్ట్ ద్వారా రాబోతున్నాయని అయన అన్నారు.

Related Posts