YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నాలెడ్జ్‌ ఎకానమీకి కేంద్రం అమరావతి కావాలి: చంద్రబాబు

నాలెడ్జ్‌ ఎకానమీకి కేంద్రం అమరావతి కావాలి: చంద్రబాబు

ఆసియాలో ప్రసిద్ధిగాంచిన జేవియర్‌ లేబర్‌ రిలేషన్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌(ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ)కు ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం శంకుస్థాపన చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మక ఏర్పాటు చేసిన ఈ సంస్థ దేశంలోనే మొదటిది.ఈ సందర్బంగా ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు మాట్లాడుతూ నాలెడ్జ్‌ ఎకానమీకి కేంద్రంగా అమరావతి తయారు కావాల్సిన  అవసరముందన్నారు. ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ అమరావతిలో విద్యా సంస్థను ఏర్పాటు చేయడం అదృష్టమన్నారు. ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐకు 50 ఎకరాలు ఇచ్చామని, రూ.250 కోట్లతో క్యాంపస్‌ నిర్మాణం చేపడతారని తెలిపారు. ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ దేశంలోనే అత్యున్నత మేనేజ్‌మెంట్‌ కోర్సులను అందిస్తోందని, ఈ ప్రాంతంలోని విద్యార్థులు ఇక్కడ చదువుకునే వీలుకలుగుతుందన్నారు. అంతర్జాతీయ పాఠశాలలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని, రైతుల పిల్లలు బాగా చదువుకోవాలని చంద్రబాబు సూచించారు.అన్ని రంగాల్లో సమర్థ నాయకత్వం అవసరమన్న చంద్రబాబు.. సమర్థ నాయకత్వంతో ఏ రంగమైనా  అభివృద్ధి సాధిస్తుందన్నారు. నవ్యాంధ్ర రాజధాని కోసం రైతులు చూపించిన చొరవ, త్యాగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. రైతుల నుంచి సమీకరించిన  భూములు అభివృద్ధి చేసి వారికే ఇవ్వటంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కొన్ని దేశాలు నాలెడ్జ్‌ ఎకానమీపై పెట్టుబడులు పెట్టాయని, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌, ఉబర్‌ వంటివన్నీ వినూత్న ఆలోచనలేనని చంద్రబాబు అన్నారు.  కేంద్ర  సంస్థలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావాల్సి అవసరం ఉందన్నారు. కేంద్ర సంస్థల కోసం 2911 ఎకరాల భూమి ఇచ్చి రూ.135 కోట్లతో కాంపౌండ్‌ వాల్‌ కట్టామని, కానీ ఏర్పాటు చేయడంలో తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. భవనాల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్నారు. కార్యక్రమంలో ఏపీ మంత్రి నారాయణ, విజయవాడ, గుంటూరు బిషప్‌లతో పాటు పలు విద్యా సంస్థల ప్రముఖులు పాల్గొన్నారు.

Related Posts