YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

చందమామ నేలరాలింది

Highlights

  • కోల్‌కతాలోని విక్టోరియా లాన్స్‌లో త్రీడీ చందమామ
  • 23 అడుగుల వెడల్పుతో మూన్‌
  • నాసా లూనార్‌ రీకనైసెన్స్‌ ఆర్బిటర్‌ కెమెరా ఇమేజరీ
  • విక్టోరియా మెమోరియల్‌ హాల్‌లో త్రీడీ ఇన్‌స్టలేషన్‌
చందమామ నేలరాలింది

తారల మధ్య తళుకులీనే చందమామ నేలరాలింది. కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్‌ లాన్స్‌లో కొలువుతీరింది. త్రీడీ చందమామను అమర్చిన ఆ ప్రాంతమంతా వీక్షకులతో కిక్కిరిసిపోయింది. నాసా లూనార్‌ రీకనైసెన్స్‌ ఆర్బిటర్‌ కెమెరా ఇమేజరీ ఉపయోగించి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించడంతో చిన్నాపెద్దా కళ్లముందు నిలిచిన చందమామను కళ్లింతలు చేసుకుని చూశారు. బ్రిటష్‌ కౌన్సిల్‌ చేపట్టిన మ్యూజియం ఆఫ్‌ ద మూన్‌ ప్రాజెక్టులో భాగంగా నగరంలోని చారిత్రక విక్టోరియా మెమోరియల్‌ హాల్‌లో త్రీడీ ఇన్‌స్టలేషన్‌ను ఉంచారు.

బెంగళూర్‌, ముంబయి, ఉదయ్‌పూర్‌లలోనూ గతంలో మ్యూజియం ఆఫ్‌ ది మూన్‌ను ప్రదర్శనకు ఉంచారు. నిజమైన చందమామ కంటే అయిదు లక్షల రెట్లు చిన్నదిగా ఈ నకలు చందమామ ఉంటుంది. 23 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ మూన్‌ చిన్నారులు, యువతను అమితంగా ఆకట్టుకుంది. బ్రిటిష్‌ ఆర్టిస్ట్‌ ల్యూక్‌ జెర్రామ్‌ ఈ మూన్‌ను నేలపై నిలిపారు. శాస్త్రం, కళల సమ్మేళనంతో ఈ ఆవిష్కరణ సాధ్యమైందని, ఇది బ్రిటిష్‌ కౌన్సిల్‌ చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అని అధికారులు పేర్కొన్నారు.

Related Posts