తెలంగాణ ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండోసారి అధికారం చేపట్టిన కేసీఆర్.. ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుతో పాటు ఏపీ ఎన్నికలపైనా దృష్టి సారించారు. తెలంగాణ ఎన్నికల్లో వేలు పెట్టిన ఏపీ సీఎం చంద్రబాబుకు తాను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చంద్రబాబును గద్దె దించేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగానే వైఎస్ జగన్‌తో కేటీఆర్ బృందం బుధవారం భేటీ అయింది. దీనిపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆంధ్రోళ్లను తెలంగాణ నుంచి తరిమికొడతానని వ్యాఖ్యానించిన కేసీఆర్‌తో జగన్ జట్టు ఎలా కడతారని నిలదీస్తున్నారు. ఇదిలా ఉండగా కేసీఆర్‌కు సంబంధించి మరోవార్త ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. ఆయన ఫిబ్రవరి నెలలో అమరావతికి రానున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన మకాంను అమరావతికి మారుస్తున్నారు. ఆయన కట్టుకుంటున్న ఇల్లు నిర్మాణం పూర్తికావొస్తోంది. దీంతో ఫిబ్రవరి 14న మంచిరోజు కావడంతో ఆరోజే గృహప్రవేశం చేయాలని అనుకుంటున్నారట. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను జగన్ ముఖ్య అతిథిగా ఆహ్వానించారట. జగన్ ఆహ్వానాన్ని మన్నించిన కేసీఆర్ అమరావతికి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికల వేళ కేసీఆర్ వస్తే రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.