అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముగ్గురు భారతసంతతి వ్యక్తులను కీలక పదవుల్లో నియమించారు. రీటా బరన్‌వాల్‌ను ఇంధనశాఖ అణుశక్తి విభాగం అసిస్టెంట్ సెక్రెటరీగా, ఆదిత్య బంజాయ్‌ని పౌరహక్కుల బోర్డు సభ్యునిగా, బిమల్ పటేల్‌ను ఆర్థికశాఖ అసిస్టెంట్ సెక్రెటరీగా నామినేట్ చేశారు. ఈ నామినేషన్లను కాంగ్రెస్ ఆమోదం కోసం పంపించారు. వీరి నియామకాల గురించి ట్రంప్ ఇదివరకే ప్రకటించినప్పటికీ బుధవారం కాంగ్రెస్‌కు అధికారికంగా ప్రతిపాదనలు సమర్పించారు. ఇప్పటివరకు మూడు డజన్లకు పైగా భారతసంతతి వ్యక్తులను ట్రంప్ ప్రభుత్వ పదవుల్లో నియమించారు. నిక్కీ హేలీ క్యాబినెట్ ర్యాంకుతో ఐక్యరాజ్య సమితి రాయబారిగా పనిచేసి ఇటీవలే రాజీనామా చేశారు. ఉప పత్రికా కార్యదర్శిగా పనిచేసిన రాజ్‌షా కూడా తన పదవి నుంచి తప్పుకున్నారు.