Highlights
- భార్య, ముగ్గురి పిల్లలతో ఫొటోలు దిగిన జస్టిన్ ట్రూడో
- ఈ నెల 23వరకు అహ్మదాబాద్, ముంబై, అమృత్‌సర్‌లో పర్యటన
- 21న స్వర్ణ దేవాలయ సందర్శన
భారత్‌లో పర్యటిస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆదివారం ఉదయం చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ట్రూడో ఫొటోలు దిగారు. తన భార్య, ముగ్గురి పిల్లలతో కలిసి సరదాగా గడిపారు. భారత్‌లో ఏడు రోజుల అధికారిక పర్యటన కోసం శనివారం ఢిల్లీకి ట్రూడో చేరుకున్న సంగతి తెలిసిందే. వారం రోజుల సుదీర్ఘ భారత పర్యటనలో భాగంగా జస్టిన్ ట్రుడియా అహ్మదాబాద్, ముంబై, అమృత్‌సర్‌లో ఈ నెల 23వరకు పర్యటించనున్నారు. మధురలోని చుర్మురా వైల్డ్ లైఫ్ శాంక్చురీని కూడా సందర్శించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2015లో కెనడా పర్యటనకు వెళ్లినప్పుడు ఆ దేశ ప్రధాని ట్రూడోను భారత్ పర్యటనకు ఆహ్వానించారు. 2012 తరువాత భారత్‌లో పర్యటిస్తున్న కెనడా ప్రధాని ట్రూడేనే కావడం విశేషం. ఈ పర్యటనలో ప్రధాని మోదీతో ట్రూడో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా దేశంలో ఉగ్రవాదం, రక్షణ సహా పలు కీలకాంశాలపై ఇరువురు ప్రధానులు చర్చించనున్నారు. 21న స్వర్ణ దేవాలయాన్ని సందర్శించనున్నారు.