తిరుమలలోని ఎన్నో ఏళ్లుగా స్వామివారిని నమ్ముకుని వ్యాపారం చేసుకొని జీవనం సాగిస్తున్న దుకాణదారుల సమస్యలపై ఇక పోరాటాలకు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఏళ్ల తరబడి పరిష్కారం కానీ సమస్యలపై అధికారులు పట్టించుకోలేదని స్థానికులందరు ఏకమయ్యారు. కొద్దికాలంగా తిరుమలలోని దుకాణదారులు టాస్క్ ఫోర్స్ వారు ఇబ్బందులకు గురి చేయడం చాలా బాధాకరమన్నారు. గత పది సంవత్సరాలుగా డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ వ్యాపారాలు చేస్తున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల పై జరిమానా విధిస్తూ లైసెన్సులు క్యాన్సల్ చేస్తున్నట్టు నోటీసులు ఇవ్వడం కక్ష సాధింపు చర్యగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనధికారికంగా కళ్యాణ కట్ట, బ్యాంకింగ్ కాంప్లెక్స్ , ఇతర ప్రదేశాలలో వ్యాపారాలు చేసుకునేందుకు అధికారులు ప్రోత్సహించడం చాలా దారుణమని సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేశారు. దుకాణాలపై టాస్క్ ఫోర్స్ పేరుతో రైడింగ్ చేసి దుకాణాల ముందు సరుకులను తీసుకెళ్లడం ఏంటని ప్రశ్నించారు. స్థానిక నాయకులు అందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం తో సమస్యలపై ఇక పోరాటం చేయాలని ఉద్ఘాటించారు. అందులో భాగంగా గత నాలుగు సంవత్సరాలుగా తమ సమస్యలపై అధికార పార్టీ నాయకులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా...ఒక్క సమస్య కూడా కొలిక్కి రాలేదని నాయకులు అన్నారు. అదేవిధంగా తిరుమ ల స్థానికులు కానివా రికి, అనధికార హాకర్లకు , లైసెన్సు లు మంజూరు చేయాలని ప్రతిపాద నలు సిద్ధం చేస్తున్న ట్లు దీనివల్ల అసలైన స్థానిక వ్యాపారస్తులు ఇబ్బందులకు గురవుతారని సమావేశంలో నిర్ణయించారు. దేవస్థానం వారు అనధికార లైసెన్సులు మంజూరు చేస్తే నిరాహార దీక్షకు వెనుకాడమని వ్యాపారస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.