YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో రాజకీయ సినిమా

ఏపీలో రాజకీయ సినిమా

 రాజకీయ సినిమా తెరపైకి వస్తోంది. ఇక్కడా టికెట్ల గోలే కనిపిస్తోంది. మరి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో టికెట్ కోసం ప్రతి పార్టీలోనూ ఆశావహులు ఎదురుచూస్తున్నారు. అధినేత కటాక్షం కోసం నిరీక్షిస్తున్నారు. మూడు విడతలుగా టీడీపీ జాబితా వుంటుందని సమాచారం తెలుస్తున్న నేపధ్యంలో తొలి జాబితాలో ఉన్న గుట్టేంటో తెలుసుకోవాలన్న ఆత్రం అధికార పార్టీలొ ఎక్కువగా కనిపిస్తోంది. అన్ని వడపోతలూ పూర్తి చేసుకుని పాస్ అయిన వారికే టికెట్లు అని చంద్రబాబు స్పష్టంగా చెప్పేశారు. దాంతో తాము పాస్ అయ్యామా లేదా అన్న టెన్షన్లో విశాఖ జిల్లా టీడీపీ తమ్ముళ్ళు ఉన్నారు.విశాఖ జిల్లాలో తొలి జాబితాలో ఆరుగురు ఎమ్మెల్యేల పేర్లు ఉంటాయని అంటున్నారు. అందులో ముగ్గురు మంత్రులు ఉండడం విశేషం. గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కిడారి శ్రావణ్ కుమార్ తో పాటు, విశాఖ అర్బన్, రూరల్ జిల్లాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు అయిన వాసుపల్లి గణేష్ కుమార్, పంచకర్ల రమేష్ బాబు లతో పాటు ప్రభుత్వ విప్ గణబాబు పేర్లు తొలి జాబితాలో ఉన్నట్లుగా చెబుతున్నారు. దీంతో మిగిలిన వారిలో కలవరం చెలరేగుతోంది.ఇక వివిధ మార్గాల ద్వారా సర్వేలు తీసుకుంటున్న చంద్రబాబుకు అవి ఏం చెప్పాయోనని ఎమ్మెల్యే తమ్ముళ్ళు కంగారు పడుతున్నారు. పని తీరు ఆధారంగానే టికెట్లు ఇస్తారని తేలడంతో టికెట్ రాకపోతే అది తమ ఫెయిల్యూర్ గానే భావించాలన్న భావనతో చాలామంది మధనపడుతున్నారు. విశాఖ జిల్లాలో మొత్తం పదిహేను ఎమ్మెల్యె స్థానాలు ఉన్నాయి. అందులో నుంచి తొలి జాబితాలో ఆరుగురు ప్రకటిస్తే మిగిలిన తొమ్మిది మందికి హై బీపీ పెరగడం ఖాయమని అంటున్నారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో జిల్లాలో నలుగురిని టికెట్ గండం ఉందని తేలడంతో ఎవరు ఆ నలుగురు అన్నది కూడా చర్చగా వుంది. మొత్తానికి సంక్రాంతి తరువాత చంద్రబాబు ప్రకటించించే తొలి జాబితా పై టీడీపీ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

Related Posts