YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సెల్ఫ్ గోల్ చేసుకున్న రాహుల్ గాంధీ

సెల్ఫ్ గోల్ చేసుకున్న రాహుల్ గాంధీ

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన చిన్న చిన్న తప్పులే కూటమికి ఆటకంగా కానున్నాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేక, సమర్థులెవరో గుర్తించలేక రాహుల్ కాంగ్రెస్ పార్టీని మిత్రులను సైతం దూరం చేస్తున్నారన్న వాదన పార్టీలోనూ బలంగా విన్పిస్తోంది. ముఖ్యంగా సోనియా గాంధీలా రాహుల్ వేగవంతమైన, కీలక నిర్ణయాలను తీసుకోలేకపోతున్నారని, రాజకీయ పరిణితి లోపించడం వల్లనే మిత్రులు సైతం పార్టీకి దూరంగా మసలుతున్నారని పార్టీలో సీనియర్ నేతలు సయితం అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నారు.ఉత్తరప్రదేశ్ లో మాయావతి, అఖిలేష్ యాదవ్ లు కాంగ్రెస్ ను దూరంగా పెట్టడానికి రాహుల్ సరైన సమయంలో స్పందించకపోవడమేనని అంటున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ ఎన్నికలలో ఎస్పీ, బీఎస్పీలతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని, భవిష్యత్తులో కూడా తమకు కలసి వస్తుందని సీనియర్ నేతలు ఆంటోని వంటి వారు రాహుల్ కు నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు.కానీ రాహుల్ మాత్రం తాను ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా స్థానిక రాష్ట్ర నేతలకే పొత్తు బాధ్యతలను అప్పగించారు.మధ్యప్రదేశ్ లో దిగ్విజయ్ సింగ్ కారణంగా మాయావతి దూరమయ్యారు. మధ్యప్రదేశ్ లో బీఎస్పీ బలం ఏముందని డిగ్గీరాజా ప్రశ్నించారు. దిగ్విజయ్ వ్యాఖ్యలు తనను బాధించాయని మాయావతి కూడా చెప్పారు. పొత్తులపై చర్చలను దిగ్విజయ్ సింగ్, కమల్ నాధ్ లు సాగదీసిన కారణంగానే మాయావతి కాంగ్రెస్ కు దూరమయ్యారు.కనీసం రాహుల్ ఈ విషయంలో జోక్యం చేసుకోలేదన్న వాదన కూడా ఉంది. రాజస్థాన్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మంత్రివర్గంలోకి తమ ఎమ్మెల్యేలను తీసుకోకపోవడాన్ని అఖిలేష్ యాదవ్ తప్పుపట్టిన సంగతి తెలిసిందే. అందుకే యూపీలో బలంగా ఉన్న తాము వీక్ గా ఉన్న కాంగ్రెస్ ను దూరం పెట్టామని వారు చెబుతున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన ఎన్డీఏ వెంట నడవటానికి రాహుల్ ప్రధాన కారణమని అర్థమవుతోంది. నితీష్ కాంగ్రెస్ కూటమి నుంచి వైదొలగడానికి లాలూ ప్రసాద్ యాదవ్ తనయులపై అవినీతి ఆరోపణలే కారణమన్నది అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయాన్ని రాహుల్ కు పదే పదే చెప్పినా ఆయన ఈవిషయాన్ని లైట్ గా తీసుకున్నారన్నారు నితీష్. లాలూ యాదవ్ కుమారులు నిత్యం శాంతిభద్రతల విషయంలో జోక్యం చేసుకుంటుడం కూడా తాను సహించలేకపోయానని, రాహుల్ స్టాండ్ తీసుకోలేనందునే తాను యూపీఏను వీడానని నితీష్ చెప్పటం విశేషం. మొత్తం మీద ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు రాహుల్ మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని సీనియర్ నేతలు అంటున్నారు. మరి ఎన్నికల నాటికి మరెంత మంది మిత్రులు రాహుల్ పై అస్త్రాలు ప్రయోగిస్తారో చూడాలి.

Related Posts