YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

అయేషా మీరా కేసు…..సత్యం బాబును విచారించని సీబీఐ

అయేషా మీరా కేసు…..సత్యం బాబును విచారించని సీబీఐ

కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం లో  సంచలనం సృష్టించిన ఆయేషా మీరా కేసు లో సిబిఐ అధికారులు సత్యంబాబు స్వగ్రామమైన నందిగామ మండలం అనసాగరం గ్రామానికి చేరుకొని సత్యం విచారించారు. సిట్ నుంచి సిబిఐకి కేసు బదలాయించిన తర్వాత మొదటిసారి సిబిఐ అధికారులు సత్యంబాబును విచారించారు.  మొత్తం ఆరుగురు సభ్యులతో కూడిన బృందం కృష్ణా జిల్లా నందిగామకు ఉదయం  సత్యం బాబు ఇంటికి చేరుకున్నారు. తరువాత  సత్యంబాబు తో విచారణ ప్రారంభించారు.  వివరాలు సత్యంబాబు నుండి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.  తన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బు ఎక్కడివడని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. తాను జైల్లో ఉన్నప్పుడు తాను చేసిన పనికి ముపై వేల రూపాయలు వచ్చినట్లుగా సత్యం చెప్పినట్లు సమాచారం. ఆ డబ్బులు తన అకౌంట్లో ఉన్నట్టుగా వాటిని గ్రామంలో అప్పులు ఉన్నవారికి చెల్లించాలని చెప్పాడు. తనను  నిర్దోషిగా ప్రకటించిన తర్వాత గ్రామంలో నిన్ను చూసి గ్రామస్తులు అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయిఅని సీబీఐ ప్రశ్నించారు. ఆయేషా హత్య జరిగిన ప్రాంతంలో ఉన్న హాస్టల్ ఎక్కడ ఉందో తెలుసా అని ప్రశ్నించారు.  దీనికి సమాధానం సత్యంబాబు ఆ హాస్టల్ ఎక్కడ ఉందో నాకు తెలియదని తెలిపాడు. హత్య జరగక ముందు నువ్వెక్కడున్నావని సిబిఐ అధికారులు అడిగిందానికి సమాధానంగా ఈ హత్య జరగక ముందు పదిహేను రోజులు తాను పెయింటింగ్ పని వెళ్లాలని తెలిపాడు. ఆయేషా మీరా హత్య కేసులో తనను ఇరికించారని ఆ కేసులో జైలు శిక్ష అనుభవించిన సత్యంబాబు సిబిఐ అధికారులకు చెప్పాడు. విచారణ పేరుతో పోలీసులు తనను చిత్రహింసలకు గురి చేశారని అతడన్నాడు.  శుక్రవారం నాడు నా కేసు కొట్టి వేశారని ఆదివారం నన్ను వదిలేశారని  చెప్పాడు. ప్రస్తుతం తాను బ్రతకడానికి ఉపాధి కూడా లేదని అతడు చెప్పాడు. సిబిఐ అధికారులు రెండు గంటలకుపైగా సత్యంబాబును విచారించారు.

2008వ సంవత్సరం నవంబర్ నెలలో ఇబ్రహీంపట్నం లోదుర్గా హాస్టల్లో బీ ఫార్మసీ చదువుతున్న గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఆయేషా మీరా చదువుకుంటుంది. ఆ రోజు ఆమె తన గదిలో నిద్రిస్తుండగా ఆమెను అత్యాచారం చేసి దారుణంగా హతమార్చారు. ఈ సంఘటనకు సంబంధించి కృష్ణాజిల్లా నందిగామ శివారు నగరానికి చెందిన సత్యంబాబు అనే వ్యక్తిని ఈ దారుణానికి పాల్పడ్డాడు అంటూ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ విచారణ సందర్భంగా 2009వ సంవత్సరంలో నందిగామ పట్టణంలో జరిగిన వివిధ హత్య అత్యాచార సంఘటనపై కూడా సత్యంబాబు నిందితుడిగా చేస్తూ మొత్తం 11 కేసులు నమోదు చేశారు. ఈ విషయంపై అప్పట్లో అనేక దళిత సంఘాలు సత్యంబాబు నిర్దోషి అంటూ ఉద్యమాలు చేశారు.  అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో ఆయేషా మీరా తల్లిదండ్రులు సైతం సత్యంబాబు నిర్దోషి అంటూ అసలైన దోషులను ప్రభుత్వం పోలీసులు తప్నించారని ఆరోపించారు ఈ నేపథ్యంలో 2009 నుంచి కొనసాగిన కోర్టు కేసులకు సంబంధించి 2018 సంవత్సరంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అయిన హైకోర్టు సత్యం బాబు పై పేర్కొన్న 11 కేసుల్లో కూడా నిర్దోషిఅంటూ సంచలన తీర్పు వెలువరించింది. సమగ్ర విచారణ చేయాలని ఆదేశించడంతో సిబిఐ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించిన దస్త్రాలు కాలిపోయాయి అంటూ స్థానిక న్యాయస్థానాలు నివేదిక ఇవ్వడంతో సి బి ఐ ఆ నివేదికలు కాలిపోవడం పై విచారణ జరిపి సంబంధిత ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసారు. 

Related Posts