నెల్లూరు నర్తకీ సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, తాళ్లపాక రమేష్ రెడ్డి, ముంగమూరు శ్రీధర్ క్రిష్ణారెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, బెజవాడ ఓబుల్ రెడ్డి టీడీపీ నాయకులు పాల్గోన్నారు. తరువాత అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగిస్తున్న నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు. రూ.30తో పింఛన్ పథకానికి శ్రీకారం చుట్టిన మహానుభావుడు ఎన్టీఆర్. పింఛన్ ను రూ.200 నుంచి రూ.2వేలకు పెంచుతూ చంద్రబాబు నాయుడు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే ఐదేళ్లలో పింఛన్ గా రూ.70 వేల కోట్లు ఎన్టీఆర్ భరోసా పింఛన్లుగా పేదలకు అందజేయనున్నారని అన్నారు. ఒకరిని చూసి కాపీ కొట్టే పరిస్థితిలో మేం లేం. పెన్షన్ వెయ్యి ఇస్తామని చెప్పేందుకు, రుణమాఫీ చేస్తామనేందుకు 2014లో జగన్ కు మనస్సు రాలేదు. అధికారంలో ఉంటే మీకు సొంత కార్యక్రమాలు. కు ప్రజల శ్రేయస్సే ముఖ్యం. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో చరిత్ర సృష్టించాం. మహిళలను గౌరవించడం తెలుగుదేశం పార్టీకి అన్న ఎన్టీఆర్ నేర్పిన సంప్రదాయమని అనర్నారు. వైస్సార్ కుమార్తె షర్మిలమ్మను పోలీసుస్టేషన్ కు తీసుకురావడం చూసి మాకే గుండె తరుక్కుపోతోంది. మేమంతా సోషల్ మీడియా బాధితులమే. జగన్ ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా ప్రత్యేక వింగ్ అందరిపై అసభ్యంగా కామెంట్లు పెడుతుంటే ఏనాడైనా సోదరుడిని షర్మిలమ్మ ప్రశ్నించారా అని నిలదీసారు. దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఒక్కటయ్యాయి. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేస్తే పట్టించుకోరు. సచ్చినా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదన్న నరేంద్ర మోదీ కనుసన్నల్లోని ఫెడరల్ ఫ్రంట్ తో జతకడతారా అని అయన విమర్శించారు.