YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

'బిగ్ బాస్-2'లో ఎన్టీఆర్ గుడ్ బై..?

Highlights

  • 'బిగ్ బాస్ -2'కి హోస్ట్‌గా అల్లు అర్జున్‌?

  • జూలై నుంచి 'బిగ్ బాస్' రెండో సీజ‌న్
'బిగ్ బాస్-2'లో ఎన్టీఆర్  గుడ్ బై..?

'బిగ్ బాస్-2' లో రెండు చిత్రాల బిజీ షెడ్యూల్ వల్ల  ఎన్టీఆర్ పాల్గొనలేకపోతున్నట్టు తెలుస్తుంది.ఎన్టీఆర్ కి ప్రత్యామ్నాయంగా అల్లు అర్జున్ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం.ఎన్టీఆర్ హోస్ట్‌గా అలరించిన 'బిగ్ బాస్'లో శివబాలాజీ విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. జూలై నుంచి 'బిగ్ బాస్' రెండో సీజ‌న్ ప్రారంభం కానుంది. దీనికి కూడా ఎన్టీఆర్ హోస్ట్ చేయాల్సివుంది. అయితే,  ప్రస్తుతం ఎన్టీఆర్.. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. ఇది మార్చి నుండి ప్రారంభం కానుంది. ఇక అక్టోబ‌ర్‌ నుంచి రాజమౌళి దర్శకత్వంలో రూపొంద‌నున్న మల్టీస్టారర్ మూవీలో కూడా ఎన్టీఆర్ నటించ‌నున్నారు. ఈ రెండు చిత్రాల బిజీ షెడ్యూల్ వల్ల 'బిగ్ బాస్-2'లో  ఎన్టీఆర్ పాల్గొనలేకపోతున్నారని సమాచారం. ఈ కార్యక్రమం కోసం ప్రతీ వారం ముంబై వెళ్లి రావడం.. కొంత ఒత్తిడితో కూడుకున్నదని ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.స్టార్ మాలో ప్రసారమైన 'బిగ్ బాస్' ఎంత విజయవంతమైందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఎన్టీఆర్ స్థానంలో అదే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ పేర్లను కూడా 'స్టార్ మా' యాజమాన్యం పరిశీలిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభాస్ ‘సాహో’ చిత్రంతో, మహేష్ బాబు త‌న 25వ చిత్రంతో (వంశీ పైడిపల్లి మూవీ) బిజీగా ఉండే అవకాశం ఉంది.  దీంతో..‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొంత ఫ్రీగా ఉండడంతో.. ఆయ‌నే ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి 

Related Posts