YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చందాబాబులా చంద్రబాబు

చందాబాబులా  చంద్రబాబు

కడప లోని కందుల ఎస్టేట్ లో బీజేపీ రాయలసీమ పార్లమెంట్ నియోజకవర్గాల శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశం జరిగింది.  ఈ భేటీకి  ఎనిమిది పార్లమెంట్   నియోజకవర్గాల శక్తి కేంద్ర ప్రముఖులు హజరయ్యారు.  కేంద్ర హోంశాఖ మంత్రి  రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, రాష్ట్ర  అధ్యక్షుడు కన్నా, రాష్ట్ర బీజేపీ నేతలు పురందేశ్వరి, సోము, విష్ణు వర్ధన్ రెడ్డి  తదితరులు పాల్గోన్నారు.  పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ ధియోదర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చందా బాబు లా తయారయ్యాడు. గజదొంగ లా కేంద్ర నిధులను దోచుకు తింటున్నారు. జన్మభూమి కమిటీల్లో మొత్తం దోంగలే ఉన్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ గెలుపుకు, రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఎన్నికల్లో టీడీపీ దొంగ ఓట్లను ఉండేలా కుట్రలు చేస్తున్నారు... వాటిని బీజేపీ బూత్ కమిటీ సభ్యులు తిప్పి కొట్టాలి. మైనార్టీల అభివృద్ధి కోసం పాటుబడే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని అన్నారు. ఈనెల 27 న పోలింగ్ బూత్ కేంద్రాలలో మన్ కీ బాత్ ద్వారా బీజేపీ నేతలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు చేయనున్నారు. బీజేపీ అంటే త్యాగాలకి నిలయం. మార్చ్ 2 వతేది దేశ వ్యాప్తంగా మోదికి మద్దతుగా వందలాది భారీ బైక్ లతో ర్యాలీ లు. టీడీపీకి జన్మ ఇచ్చిన ఎన్టీఆర్ ఆత్మ క్షోబించేలా కాంగ్రెస్ తో స్నేహం చేయడం దారుణమని అన్నారు. బాహుబలి లో కట్టప్ప ఎలాగైతే వెన్నుపోటు పొడిచారో అలవే ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి టీడీపీ ని కబ్జా చేశారు. మోడీ ప్రవేశ పెట్టిన పథకాలకు చంద్రబాబు స్టికర్ వేసుకుని ప్రచారాలు చేసుకోవడం దుర్మార్గమని విమర్శించారు. 

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ కడప వేదిక గా బీజేపీ రాయలసీమ శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశం జరగడం శుభ పరిణామం.  రాజకీయ ఎన్నికల రణ శంఖారావాన్ని కడప నుండి  రాజ్ నాధ్ సింగ్ ప్రారంభించనున్నారు. ఆంధ్ర ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు గద్దె దింపేందుకు సిద్ధం అయ్యారని అన్నారు. కేంద్ర బీజేపీ రాష్ట్రానికి చేస్తున్న అభివృద్ధి ప్రజలకు చెప్పకుండా మోడీని విమర్శించడం సిగ్గు చేటు. రాష్ట్రానికి 24 గంటలు విద్యుత్ ఇచ్చిన ఘనత ప్రధాని మోడీదే. గత చంద్రబాబు హయాంలో కరెంట్ ఎలా ఉండేదో ప్రజలకి తెలుసు. ప్రజలు ఇవన్నీ గమనించి 2019 లో చంద్రబాబు కు తగిన గుణపాఠం చెప్పాలి. చంద్రబాబు అవినీతి పై ప్రతిపక్ష నేత వైయస్ జగన్ బ్రోచర్ విడుదల చేసారని అన్నారు. 6 లక్షల కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి దోచుకున్నారని జగన్ స్పష్టంగా తెలిపారు. 16 వేల కోట్ల రూపాయల తో నీరు చెట్టు చేపట్టి నిధులను మింగారని అన్నారు. చెప్పుకుంటూ పోతే చంద్రబాబు అవినీతికి హద్దులు లేవని వ్యాఖ్యానించారు.  రాష్ట్రంలో ప్రజలకు ఇల్లు కట్టించాలని నిధులు ఇస్తే కట్టింది మాత్రం శూన్యం. చంద్రబాబు దృష్టిలో ప్రజలు అద్దె ఇంటి కల.  మోడీకి సొంతిల్లు కల. రాష్ట్ర అభివృద్ధి లో మోడీ లేకుంటే చంద్రబాబు జీరో అని అన్నారు.  

Related Posts