YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రఘవీరారెడ్డి భవిష్యత్తుపై నీలినీడలు

రఘవీరారెడ్డి భవిష్యత్తుపై నీలినీడలు

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తారా ? లేదంటే పార్లమెంట్‌కు పోటీ చేస్తారా ? అసెంబ్లీకి పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ? అసెంబ్లీకి పోటీ చేయకపోతే  ఏ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేస్తారన్న దానిపై జిల్లా రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.సంచలన రాజకీయాలకు కేంద్ర బిందువైన అనంతపురం జిల్లాలో...వచ్చే ఎన్నికలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లతో పాటు రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 12 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఉరవకొండ, కదిరి స్థానాలను వైసీపీ గెలుచుకుంది. కొంతకాలానికి చాంద్‌బాషా కూడా తెలుగుదేశం పార్టీలోచేరిపోయారు. దీంతో తెలుగుదేశం ఎమ్మెల్యేల బలం 13కు చేరితే...వైసీపీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే మిగిలాడు. అయితే త్వరలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.పీసీసీ చీఫ్, మాజీ మంత్రి రఘువీరారెడ్డి...కల్యాణదుర్గం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. గతంలో కల్యాణదుర్గం నియోజయవర్గం నుంచి పోటీ చేసి...విజయం సాధించారు. ఆ తర్వాత వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా సేవలందించారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అందుకనుగుణంగా కొంతకాలంగా పలు కార్యక్రమాలను చేపడుతూ...గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్, టీడీపీ మధ్య పొత్తు కుదిరితే....రఘువీరారెడ్డిని హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. రఘువీరా హిందూపురం నుంచి బరిలోకి దిగితే...మిగతా అసెంబ్లీ సీట్ల గెలుపునకు మార్గం సుగమం అవుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. అయితే రఘువీరా మాత్రం అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో రఘువీరారెడ్డి అసెంబ్లీకి పోటీ చేస్తారా ? పార్లమెంట్‌కు పోటీ చేస్తారా అన్న వ్యవహారం కాంగ్రెస్, టీడీపీ పొత్తులపై ఆధారపడి ఉంది. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే....రఘువీరారెడ్డి పార్లమెంట్ చేస్తారన్న ప్రచారం జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ఏది ఏమైనా పార్లమెంట్‌కా ? లేదంటే అసెంబ్లీకా అన్న దానిపై క్లారిటీ రావాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే

Related Posts