Highlights
- శ్రీలంక క్లీన్ స్వీప్
- రెండో టీ20లోనూ ఓడిని బంగ్లాదేశ్
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లోనూ విజయం సాధించిన శ్రీలంక 2 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 4 వికెట్లు కోల్పోయి 210 పరుగుల భారీ స్కోరును సాధించింది. లంకలో కుశాల్ మెండీస్ (42 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో చెలరేగి 70 పరుగులు చేశాడు. మరోవైపు గునతిలకతో (37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్)లతో కలిసి తొలి వికెట్‌కు 66 బంతుల్లో 98 పరుగుల కీలకైమెన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇతర బ్యాట్స్‌వెున్‌లో వేగంగా ఆడిన పెరెరా 17 బంతుల్లోనే 31, ఉపుల్ తరంగా 13 బంతుల్లోనే 25 పరుగులు చేశారు. చివర్లో శనక 11 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 30 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో లంక భారీ స్కోరును సాధించింది. తర్వాత భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్‌లోనూ తడబడింది. లంక బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాట్స్‌మెన్ క్రీజులో నిల్చుండలేక పోయారు. వరుస క్రమంలో వికెట్లు చేజార్చుకున్నారు. బంగ్లా కెప్టెన్ మహ్మదుల్లా (31 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్)తో 41 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్ తమిమ్ ఇక్బాల్ (29), షఫీఉద్దీన్ (20), మెహదీ హస్సన్ (11) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ రెండు డిజిట్‌ల స్కోరును కూడా దాటలేకపోయారు. దీంతో బంగ్లా (18.4 ఓవర్లలో) 135 పరుగులకు ఆలౌటైంది. 75 పరుగులతో ఓటమిని మూటకట్టుకొని, సిరీస్‌ను కూడా కోల్పోయింది. తొలి మ్యాచ్‌లో కూడా రాణించి, రెండో మ్యాచ్‌లో కూడా చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన కుశాల్ మెండీస్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.