కొటప్పకోండలో హిల్ పెస్టివల్ ఏర్పాట్లను స్పీకర్ కోడెల శివప్రసాదరావు శనివారం పరిశీలించారు. పెస్టివల్ కు వచ్చిన పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా ఏర్పాట్లు చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ, డ్వాక్రా, మెఫ్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బజార్లను అయన పరిశీలించారు. ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమ వంటకాలను రుచి చూసారు. పర్యాటకుల కోసం లేపాక్షి హ్యండిక్రాప్టు, చేనేత వస్త్రా బజార్లని ఏర్పాటు చేసారు. పెస్టివల్ లో ప్యారా మోటార్ , ప్యారా సైలింగ్, హట్ ఎయిర్ బెలూన్ రైడ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రోజుకు 5గంటల సేపు సినిమా, జబర్దస్త్ కళాకారుల, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. గ్రామీణ క్రీడలైన గోలీ, కర్రాబిళ్లా, బోంగరం, తాడు ఆటల్లో స్పీకర్ పాల్గోన్నారు..