YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అవినీతిపై చర్యలతో పార్టీలు భయపడుతున్నాయి : మోడీ

 అవినీతిపై చర్యలతో పార్టీలు భయపడుతున్నాయి : మోడీ
కోల్‌కతాలో విపక్షాలు చేస్తున్న ర్యాలీ బీజేపీకి వ్యతిరేకంగా కాదని.. దేశ ప్రజలకు వ్యతిరేకంగా అంటున్నారు ప్రధాని మోదీ. అవినీతిపై తాను తీసుకున్న చర్యలు కొందరికి మింగుడుపడటం లేదని.. ప్రజాధనాన్ని లూటీ చేయకుండా తాను అడ్డుకోవడమే వారి ఆగ్రహానికి కారణమన్నారు. గుజరాత్‌లోని సిల్వస్సాలో జరిగిన ర్యాలీలో మాట్లాడిన ప్రధాని.. విపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రజల సొత్తు దోచుకోకుండా అడ్డుపడుతున్నందుకు విపక్ష పార్టీల నేతలు చేతులు కలిపారన్నారు మోదీ. ఇప్పటికే ఎవరి వాటాలు వారు మాట్లాడుకున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ సత్తా చూసి ప్రాంతీయ పార్టీలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయని.. దిక్కుతోచని స్థితిలో సాయం కావాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారన్నారు. కోల్‌కతా వేదిక నుంచి బచావ్ బచావ్ అంటూ కేకలు పెడుతున్నాయని సెటైర్లు పేల్చారు. గతంలో కాంగ్రెస్‌ను విమర్శించినవాళ్లే ఇప్పుడు ఒకే తాటిపైకి వచ్చారన్నారు మోదీ. ఆ కూటమిలోని పార్టీల మధ్యే అసలు ఐక్యత లేదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికలు అభివృద్ది, అవినీతికి మధ్య యుద్ధంగా అభివర్ణించారు. విపక్షాలు చేస్తున్నపనుల్ని ప్రజలు చాలా దగ్గర నుంచి గమనిస్తున్నారన్న విషయాన్ని మర్చిపోకూడదన్నా

Related Posts