అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘ఎఫ్2’ సంక్రాంతి రేసులో విజేతగా నిలిచింది. రామ్ చరణ్ వినయ విధేయ రామకు డిజాస్టర్ టాక్ రాగా.. ప్రశంసలు దక్కినప్పటికీ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’కి కలెక్షన్లు మాత్రం రాలేదు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన ఎఫ్2 హిట్ టాక్‌తోపాటు మంచి కలెక్షన్లు రాబట్టింది. చక్కటి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తొలి వారం ప్రపంచవ్యాప్తంగా రూ.42.76 కోట్ల షేర్ రాబట్టింది. ఈ వారాంతానికి రూ.50 కోట్ల షేర్‌ను రాబట్టనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎఫ్2కు చక్కటి ఆదరణ లభించింది. తొలివారం ఏపీ, తెలంగాణల్లో ఈ సినిమా రూ.35 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. అమెరికాలోనూ ఈ చిత్రం దాదాపు రూ.5 కోట్లు వసూలు చేసింది.
ప్రాంతాల వారీగా చూస్తే.. నైజాంలో తొలి వారంలో రూ.11.83 కోట్లు రాబట్టిన ఎఫ్2.. సీడెడ్‌లో రూ.4.7 కోట్లు వసూలు చేసింది. ఉత్తరాంధ్రలో రూ.4.75 కోట్లు, గుంటూరులో రూ.3.14 కోట్లు రాబట్టింది. తూర్పు గోదావరిలో రూ.4.26 కోట్లు, పశ్చిమలో రూ.2.37 కోట్లు.. కృష్ణాలో రూ.3.13 కోట్లు వసూలు చేసింది. సీడెడ్ మినహా అన్ని ప్రాంతాల బయ్యర్లు ఇప్పటికే లాభాల్లోకి వచ్చేశారు. ఈ వీకెండ్ ముగిసేలోగా సీడెడ్‌లోనూ బయ్యర్ సేఫ్ జోన్లోకి వస్తాడు.