YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

అక్రిడేషన్ లేకపోవడంతో నిలిచిన ఫెదరర్

అక్రిడేషన్ లేకపోవడంతో నిలిచిన ఫెదరర్
ఆస్ట్రేలియా ఓపెన్‌లో టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు చేదు అనుభవం ఎదురైంది. అక్రిడేషన్ మర్చిపోయిన ఫెదరర్‌ను డ్రెస్సింగ్‌ రూంలో వెళ్లకుండా అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. గుర్తింపు కార్డు లేకపోవడంతో 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన ఫెదరర్ కూడా తన సపోర్ట్ టీం సభ్యులు వచ్చే వరకు నిశ్శబ్దంగా అక్కడే వేచి ఉండాల్సి వచ్చింది. డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లడానికి.. నేనే ‘రోజర్ ఫెదరర్’ అని ఫెడ్డీ నిరూపించుకోవాల్సి వచ్చిందిఫెదరర్ ఓపికగా నిలబడగా.. ఆయన కోచ్ ఇవాన్ జుబిసిస్ వెంటనే అక్కడికి వచ్చాడు. ఆయన ఐడీ కార్డ్ చూపించిన తర్వాత గానీ ఫెడ్డీని లోపలికి అనుమతిచలేదు. ఈ వీడియో కాసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ వీడియోను షేర్ చేసింది. రోజర్ ఫెదరర్‌కి కూడా అక్రిడేషన్ కావాలంటూ ట్వీట్ చేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు, కోచ్‌లు, అధికారులు, మీడియా ప్రతినిధులు అక్రిడేషన్ కార్డులను తీసుకెళ్లడం తప్పనిసరి. ఆ గుర్తింపు కార్డుపై సంబంధిత వ్యక్తుల ప్రాథమిక సమాచారంతోపాటు బార్ కోడ్ కూడా ఉంటుంది. సెక్యూరిటీ చెక్ పాయింట్లలో దాన్ని స్కాన్ చేస్తారు. ఐడీ కార్డులు లేకపోవడంతో ఆటగాళ్లను నిలిపేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో మరియా షరపోవాను కూడా ఐడీ కార్డు కోసం కారిడార్లో నిలిపేశారు

Related Posts