నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం వెల్లడించిన జేఈఈ మెయిన్ 2019 మొదటి విడత పరీక్ష ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. దేశవ్యాప్తంగా మొత్తం 15 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా.. వారిలో ఐదుగురు తెలుగు రాష్ట్రాల విద్యార్థులే కావడం విశేషం. వారిలో నలుగురు తెలంగాణకు చెందిన విద్యార్థులు కాగా.. ఒకరు ఏపీకి చెందిన విద్యార్థి ఉన్నారు. తెలంగాణ నుంచి అదెల్లి సాయికిరణ్, ఇందుకూరి జయంత్ ఫణి సాయి, బట్టెపాటి కార్తికేయా, కె. విశ్వంత్ 100 పర్సంటైల్ సాధించారు. ఇక ఏపీ నుంచి బొజ్జ చేతన్ రెడ్డి ఒక్కడే 100 పర్సంటైల్‌తో స్టేట్ టాపర్‌గా నిలిచాడు.
జేఈఈ మెయిన్ 2019 ఫలితాలుదేశవ్యాప్తంగా 258 నగరాల్లో జనవరి 8 నుంచి 12వ వరకు జేఈఈ మెయిన్ పరీక్షలను ఎన్టీఏ నిర్వహించింది. ఈ పరీక్షలకు 9.29 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలకు సంబంధించిన 'కీ'ని జనవరి 14న ఎన్టీఏ విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ ఆధారంగా ఫలితాలను చూసుకోవచ్చు.
జేఈఈ మెయిన్ 2019 ఫలితాల్లో టాపర్స్..
1 ధ్రువ్ అరోరా మధ్యప్రదేశ్
2 రాజ్ ఆర్యన్ అగర్వాల్ మహారాష్ట్ర
3 అదెల్లి సాయికిరణ్ తెలంగాణ
4 బొబ్జ చేతన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్
5 సంబిత్ బెహ్రా రాజస్థాన్
6 నమన్ గుప్తా ఉత్తర్‌ప్రదేశ్
7 ఇందుకూరి జయంత్ ఫణి సాయి తెలంగాణ
8 కె. విశ్వంత్ తెలంగాణ
9 హిమాన్షు గౌరవ్ సింగ్ ఉత్తర్‌ప్రదేశ్
10 కెవిన్ మార్టిన్ కర్ణాటక
11 శుభంకర్ గంభీర్ రాజస్థాన్
12 బట్టెపాటి కార్తికేయ తెలంగాణ
13 అంకిత్ కుమార్ మిశ్రా మహారాష్ట్ర
14 జయేశ్ సింగ్లా పంజాబ్
15 గుప్తా కార్తికేయ్ చంద్రేశ్ మహారాష్ట్ర