గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో శనివారం ఉపముఖ్యమంత్రి కె.ఈ కృష్ణమూర్తి, ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, మంత్రి అయ్యన్నపాత్రుడు పర్యటించారు. ఎన్టీయార్ గార్డెన్స్, తారక రామ సాగర్, వావిలాల ఘాట్ లను వారు సందర్శించారు. కే ఈ మాట్లాడుతూ స్పీకర్ కోడెల చాలా అధ్బుతంగా ఎన్టీయార్ విగ్రహం ప్రతిష్ట్ర చేశారు. ఈ ప్రాజెక్టు సత్తెనపల్లి ప్రజల అదృష్టం. అధ్బుతమైన వాతావరణంలో మంచి క్యాప్షన్ తో విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు. ఎన్టీయార్ చాలా దైర్య వంతుడు.. ఆయన క్యాబినేట్ లోచేయడం నా అదృష్టం. మద్రాస్ ప్రజలకు నీళ్లు ఇచ్చిన ఘనత ఎన్టీయార్ ది. ఎన్టీయార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలను నేటికీ దేశంలో చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని అన్నారు. ఎన్టీయార్ ఆశయాలను చంద్రబాబు నెరవేరుస్తున్నారు. రెండు రూపాయలకు కేజీ బియ్యం ఇచ్చిన ఘనత ఎన్టీయార్ ది. తెలుగు ప్రజల కోసం ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీ పెట్టారని అన్నారు. మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ సంతోషంగా ఉంది స్పీకర్ ఆధ్వర్యంలో అన్న ఎన్టీయార్ భారీ విగ్రహం ప్రతిష్ట చేసుకోవడం. ఎన్టీయార్ యుగపురుషుడు. దేశ రాజకీయాల్లో నూతన వరవడి తెచ్చిన వ్యక్తి ఎన్టీయార్. నాలాంటి వాళ్లూ ఈ స్థాయిలో ఉన్నారంటే ఆయనే కారణం. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు నేడు దేశంలో చాల ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. స్పీకర్ అడుగుల్లో అడుగులు వేస్తూ ప్రతి జిల్లాలో అన్న ఎన్టీయార్ విగ్రహలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని అన్నారు.