YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ముంబైలో బీటెక్ కంప్యూటర్స్ లక్ష్యం

ముంబైలో బీటెక్ కంప్యూటర్స్ లక్ష్యం

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం (జనవరి 19) వెల్లడించిన జేఈఈ మెయిన్ 2019 మొదటి విడత పరీక్ష ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. దేశవ్యాప్తంగా మొత్తం 15 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా.. వారిలో ఐదుగురు తెలుగు రాష్ట్రాల విద్యార్థులే కావడం విశేషం. వారిలో నలుగురు తెలంగాణకు చెందిన విద్యార్థులు కాగా.. ఒకరు ఏపీకి చెందిన విద్యార్థి ఉన్నారు. తెలంగాణ నుంచి అదెల్లి సాయికిరణ్, ఇందుకూరి జయంత్ ఫణి సాయి, బట్టెపాటి కార్తికేయా, కె. విశ్వంత్ 100 పర్సంటైల్ సాధించగా.. ఇక ఏపీ నుంచి బొజ్జ చేతన్ రెడ్డి 'ఒకే ఒక్కడు'గా 100 పర్సంటైల్‌తో స్టేట్ టాపర్‌గా నిలిచాడు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఏపీ నుంచి టాపర్‌గా నిలిచిన చేతన్ స్వస్థలం కృష్ణాజిల్లా తాడేపల్లి. విజయవాడ గాయత్రి నగర్‌లోని చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివాడు. జేఈఈ మెయిన్స్ మొదటి విడత పరీక్షలో అత్యుత్తమ ప్రతిభతో 100 పర్సంటైల్ సాధించాడు. పరీక్షలో 360 మార్కులకుగాను 350 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచాడు. ఎప్పుడు నిశ్శబ్దంగా, కాన్ఫిడెంట్‌గా కనిపించే చేతన్‌ను  పలకరించగా.. జేఈఈ మెయిన్ ఫలితాలు రావడంతో.. ఇప్పుడిక తన దృష్టంతా జేఈఈ అడ్వాన్స్ పరీక్ష మీదే ఉందని.. ఐఐటీ బాంబేలో బీటెక్ (కంప్యూటర్స్) చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశాడు. జేఈఈ మెయిన్ పరీక్షకు రోజులో 12 నుంచి 13 గంటలు చదివానని.. ఫిజిక్స్ తనకు ఇష్టమైన సబ్జెక్టు అని చేతన్ తెలిపాడు. జేఈఈ అడ్వాన్స్‌లో టాప్-10 ర్యాంక్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు. 

Related Posts