YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

లాలూ ప్రసాద్ యాదవ్‌కు రెగ్యులర్ బెయిల్

లాలూ ప్రసాద్ యాదవ్‌కు రెగ్యులర్ బెయిల్

ఐఆర్‌సీటీసీ కేసులో రైల్వే మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. ఈ కేసులో లాలూ ప్రసాద్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు ప్రకటన చేసింది. రూ. లక్ష బెయిల్ బాండ్, ఒకరి పూచీకత్తుతో బెయిల్ మంజూరైంది.తన ఆరోగ్యం సరిగా లేనందున ఐఆర్‌సీటీసీ రెండు కేసుల్లోనూ తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాల్సిందిగా గతేడాది డిసెంబర్ లో న్యాయమూర్తిని లాలు ప్రసాద్ యాదవ్ అభ్యర్థించారు. దీనికి జనవరి 19లోగా సమాధానమివ్వాల్సిందిగా ఈడీ, సీబీఐలను ఆదేశించిన న్యాయమూర్తి.. అంతవరకు లాలూకు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నిందితులుగా ఉన్న లాలూ భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్‌లకు న్యాయస్థానం ఇప్పటికే సీబీఐ కేసులో రెగ్యులర్ బెయిల్‌ను, ఈడీ కేసులో మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. రెండు ఐఆర్‌సీటీసీ హోటళ్ల కాంట్రాక్టును ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టడం వెనుక అక్రమాలు జరిగాయంటూ ఈడీ, సీబీఐ వేర్వేరుగా కేసులను నమోదు చేశాయి. ఈ కేసుల్లో అప్పటి రైల్వే మంత్రి లాలూప్రసాద్ యాదవ్‌తోపాటు ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వీయాదవ్, మరికొందరు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే.

Related Posts