YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

రాశి ఫలాలు 

Highlights

  • శుభమస్తు
రాశి ఫలాలు 


మేషం:బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు, శుభాకాంక్షలు అందుకుంటారు. వస్త్ర, బంగారు, వెండి, కిరాణా వ్యాపారస్తులకు లాభదాయకం. ప్రైవేటు సంస్థలవారికి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ఉమ్మడి ఆర్థిక లావాదేవీలలో మాటపడాల్సి రావచ్చు. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి చికాకులు తప్పవు.

వృషభం:మీ లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం. ఉమ్మడి వ్యాపారాలపట్ల ఏకాగ్రత అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కళాకారులకు, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెద్దలను సంప్రదించటం వలన జయం చేకూరుతుంది. పాత వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలపట్ల శ్రద్ధ వహిస్తారు.

మిథునం:గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. చాకచక్యంగా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ప్రేమికుల మధ్య అనుమానాలు తొలగిపోతాయి.

కర్కాటకం:విద్యార్థులు కళాత్మక, క్రీడా పోటీలలో విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సభ, సమావేశాలలో ఆశక్తికరమైన విషయాలు చర్చిస్తారు. తరచూ దేవాలయ సందర్శనం చేస్తారు. కళారంగాల వారికి అనుకూలమైన కాలం. కాన్ని నిర్భంధాలకు లోనవక తప్పదు. రుణఒత్తిడి తొలగుతుంది.

సింహం:వృత్తి, వ్యాపారాలలో ముందుడుగు వేస్తారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. దూర ప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కొత్త బాధ్యతలు చేపడతారు. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి సన్మాన, సత్కారాలు అందుతాయి.

కన్య:ఆర్థిక లావాదేవీలు నిరాశపరుస్తాయి. ప్రత్యర్థులను ఆకట్టుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. మీ అంచనాలు నిజం అవుతాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి, యాజమాన్యంతో ఏకీభావం కుదరదు. పెట్టుబడుల కోసం పనులు ముమ్మరం చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

తుల:రాజకీయ, కళారంగాల వారికి యోగదాయకం. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు పనిభారం అధికం. మీ ప్రయత్నాలకు సన్నిహితుల చేయూత లభిస్తుంది. శుభవార్తలు వింటారు. ఇంటర్వ్యూలలో విజయం. వృత్తి, వ్యాపారాలలో ఆశాజనకంగా ఉంటుంది. విదేశీ పర్యటన ఏర్పాట్లు ముమ్మరం కాగలవు. తీర్థయాత్రలు చేస్తారు.

వృశ్చికం:విందు వినోదాలలో పాల్గొంటారు. నిర్మాణ పథకాలలో పురోభివృద్ధి కానవస్తుంది. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. సోదరీ, సోదరుల కలయిక, పరస్పర అవగాహన కుదరదు. వ్యూహాత్మకంగా ముందుకుసాగి వ్యవహారాలు చక్కదిద్దుతారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. మీ అంచనాలు నిజమైన ఊరట చెందుతాయి.

ధనస్సు:మీ ఖర్చుకు మించిన ధనం ఖర్చు అవటంవల్ల ఆందోళనకు గురవక తప్పదు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. విద్యార్థులకు ఏకాగ్రతా లోపం వల్ల చికాకులు తప్పవు. ముఖ్యమైన ఎగ్రిమెంట్లు మీకు అనుకూలిస్తాయి. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. వేడుకల్లో పాల్గొంటారు.

మకరం:వస్త్ర, బంగారు, వెండి, కిరాణా, చిరు వ్యాపారస్తులకు లాభదాయకం. అందరికీ సహాయం చేసి, నిందారోపణ ఎదుర్కోవలసి వస్తుంది. ధనం ఎంత వస్తున్నా ఏ మాత్రం నిల్వ చేయలేక పోతారు. కొత్త ఆహ్వానాలను అందుకుంటారు. బంధు, మిత్రులకు ఆహ్వానాలు, కానుకలు అందిస్తారు. కిరాణా, ఫ్యాన్సీ వ్యాపారస్తులకు కలిసి రాగలదు.

కుంభం:వ్యాపారం కోసం పెట్టుబడులు పెట్టునప్పుడు మెలకువ అవసరం. విద్యార్థులు ఏకాగ్రత వలన జయం పొందుతారు. బంధువుల రాకతో అధికంగా రుణాలు చేస్తారు. ప్రియతములలో మార్పు మీకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం అందటంతో ఉపశమనం పొందుతారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.

మీనం:ఆడిటర్లకు అభివృద్ధి, ప్లీడర్లకు సంతృప్తి కానరాగలవు. ప్రేమ అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. శుభకార్యాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. గృహంలో సందడి నెలకొంటుంది. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. దైవ, సేవా పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరుల విషయాలలో తలదూర్చటంవల్ల మాటపడక తప్పదు.

Related Posts