YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

ప్రైవేట్ ఆస్పత్రుల్లో గాలికి ఫైర్ సేఫ్టీ

ప్రైవేట్ ఆస్పత్రుల్లో గాలికి ఫైర్ సేఫ్టీ

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రయివేటు ఆస్పత్రుల్లో హఠాత్తుగా అగ్నిప్రమాదం సంభవిస్తే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్దకంగా మారింది. ప్రభుత్వాస్పత్రులు పైర్‌సేఫ్టీపై పట్టనట్టే వ్యవహరిస్తున్నాయి. ప్రతిష్టాత్మక ఉస్మానియా, నిమ్స్‌, కోఠి ప్రసూతి ఆస్పత్రి, నిలోఫర్‌, కింగ్‌కోఠి ఆస్పత్రుల్లో ఫైర్‌సేఫ్టీ ఇసుమంతైనా కనిపించదు. కనీసం సీఓ-2 పైర్‌ సిలిండర్లను కూడా సమయానికి మార్చలేకపోతున్నారు. ఏదో మొక్కుబడిగా చేశామన్నట్టు చేసేస్తున్నారు. ప్రయివేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి అగ్నిప్రమాద నివారణ చర్యలు పాటించేవి వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఇందులో ఎక్కువగా ఇరుకిరుకు భవనాల్లో చికిత్స అందించేవే ఉండటం విశేషం. ఎయిర్‌ కండీషన్డ్‌ మిషన్ల లోపల విద్యుత్‌ తీగులను అమరుస్తున్నారు. వీటిని ఎప్పటికప్పుడు పరిశీలించకపోతే ఏ క్షణాన అగ్నిప్రమాదం సంభవిస్తుందో ఊహించడం కష్టమే. నిజానికి ఏడాదికోసారి ఇవి అనుమతులను పునరుద్ధరించుకోవాలి.రోగులు, వారి సహాయకులు ప్రాణాలతో బయటపడతారు? దీనికి సమాధానం చెప్పడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఆదాయం పరమావదిగా యజమాన్యాలు వ్యవహరిస్తూ, ప్రమాద నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయి. ఇటీవల అగ్గిప్రమాద నివారణ చర్యలపై జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. ఆరు బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, పబ్‌లను సీజ్‌ చేసింది. ప్రయివేటు ఆస్పత్రులపైనా ఇలాంటి తనిఖీలు చేయాలనే డిమాండ్‌ వినిపిస్తున్నది. ఖర్చు పేరుతో భద్రత నిబంధనలను పాటించకపోగా.. కనీస జాగ్రత్తలను కూడా ఆస్పత్రులు పాటించట్లేదు. చివరికి ఇది రోగుల ప్రాణాల మీదకు వస్తున్నది. గతేడాది హన్మకొండ రోహిణి ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆస్పత్రిలో 190 మందికి పైగా రోగులు, వారి సహాయకులు ఉండగా.. ఇద్దరు మృతి చెందారు. రెండేండ్ల క్రితం భువనేశ్వర్‌లోని ఓ ఆస్పత్రిలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోగా, వందకుపైగా క్షతగాత్రులయ్యారు. ఆ సంఘటనలు జరిగినప్పుడు అధికారుల హాడావుడి అంతా ఇంతకాదు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో మచ్చుకైనా తనిఖీలు జరపడం లేదు. రాష్ట్రంలో సుమారు 5 వేల ఆస్పత్రులు ఉన్నట్టు అంచనా. వీటిలో సర్కారువి 2,500 ఉంటే.. మిగిలినవి నాలుగైదు అంతస్తులున్న ప్రయివేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులే. వీటిలో ఫైర్‌సేఫ్టీ అనుమతి పొందినవి 500 లోపే ఉన్నాయని అధికారులు చెప్పడం విశేషం. ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదం జరిగితే చాలా వరకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. రాష్ట్రంరలో చాలా ఆస్పత్రుల్లో ఫైర్‌ ఎగ్జిట్‌లు లేకపోవడం, అగ్నిప్రమాదంపై కనీస ముందస్తు ఆలోచన లేకపోవడంతో ఏదైన ప్రమాదం సంభవిస్తే పెద్దఎత్తున ప్రాణాపాయం జరిగే అవకాశాలున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పైర్‌సేఫ్టీ, వైద్యఆరోగ్యశాఖ అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. 1999 పైర్‌సేఫ్టీ చట్టంలోని సెక్షన్‌ 121 పలు నిబంధనలు పేర్కొంటున్నది. 15 మీటర్లకు పైగా ఎత్తున్న వ్యాపార సంబంధ భవనాలు విధిగా పైర్‌సేఫ్టీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గృహ సంబంధ నిర్మాణాలకు సంబంధించి 18 మీటర్లపైగా ఎత్తున్న బహుళ అంతస్తులకు ఫైర్‌సేఫ్టీ సర్టిఫికేట్‌ తప్పనిసరి. కానీ, బహుళ అంతస్తుల భవనాల్లో చాలా వరకు ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రులకు ఉండాల్సిన కనీస సౌకర్యాలు, నిబంధనలసు పాటించకుండా ఏర్పాటు చేస్తున్నారు. ఇరు శాఖల అధికారులు పెద్దఎత్తున ముడుపులు తీసుకొని అనుమతుల ఇచ్చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అనుమతుల విషయంలో అగ్నిమాపక శాఖ కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. ఏయే భవ నాలకు పైర్‌సేఫ్టీ అనుమతి ఉంది. వేటికి లేదో ఖచ్చితంగా నిర్ధారించాలి. ఆ తరు వాతే భవన నిర్మాణం చేయాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. జీ ప్లస్‌ టూ భవనాలకు ఖచ్చితంగా పైర్‌సేఫ్టీని పాటించాల్సి ఉంటుంది. ఆ మేరకు 30 ఫీట్ల రోడ్డుండాలి. ఆ తరువాత అగ్నిమాపక శకటం తిరిగేందుకు ఖాళీ స్థలం వదలాలి. కానీ చాలా వాటిలో కనీసం వాహనాలకు కూడా పార్కింగ్‌ సదుపాయం లేదు. నిబంధనలు పాటించే వాటిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చంటే అతిశయోక్తి కాదు.అగ్నిప్రమాదం జరిగినప్పుడు విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తారు. కాబట్టి ప్రత్యేకంగా జనరేటర్‌ ఉండాలి. భవనంపైన నీటి తెరను ఏర్పాటు చేయాలి. ప్రమాదం జరిగినప్పుడు పక్కనున్న భవనాలకు వ్యాపించకుండా నీళ్లు నిరంత రాయంగా పడుతుండాలి. ప్రతి అంతస్తుకు నీటిని అందించే పైపును ఏర్పాటు చేయాలి. ఆస్పత్రి బయట కూడా పొడవైన పైపులను ఏర్పాటు చేయా లి. వీటి ద్వారా వెలుపలి నుంచి భవనంపైకి నీళ్లను చిమ్మడం వీలవుతుంది. ప్రమాదం జరగ్గానే హెచ్చ రికను మోగించే పరికరాన్ని అమర్చాలి. భవనం కింది భాగంలో 70 వేల లీటర్ల నీటిని నిల్వచేసే ట్యాంకును, 30 వేల లీటర్ల సామర్థ్యమున్న మరొక దాన్ని భవనం పైభాగానా ఏర్పాటు చేయాలి. ఈ నీటిని వేటికీ వాడకూడదు. ఈ నీళ్లను పైపుల్లో నిరంతరం సరఫరా చేస్తుండాలి. ఆరు నెలలకోసారి అగ్నిప్రమాద నివారణ చర్యలపై మాక్‌ డ్రిల్‌ నిర్వహి స్తుండాలి. భవనానికి రెండు వైపులా మెట్లను ఏర్పాటు చేయాలి. ప్రమాదం జరిగినప్పుడు రోగులు, సిబ్బంది వీటి ద్వారా బయటకు వచ్చే వీలుంటుంది. వీటి గురించి పెద్దక్షరాలతో గోడలపై రాసి ఉంచాలి. నిబంధనల ప్రకారం 15 మీటర్ల ఎత్తు దాటిన భవనాలపైనే చర్యలు తీసుకునే అధికారం అగ్నిమాపక శాఖకు ఉంటుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. అంతకన్న తక్కువ ఎత్తున్న భవనాలపై చర్యలు తీసుకొనే అధికారం లేదని.. అలాంటి భవనాల్లో అగ్నిప్రమాదం సంభవిస్తే.. సమయానికి వెళ్లి ప్రమాదాలు అదుపుచేస్తామని తెలిపారు

Related Posts