ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. రాజకీయాల్లో పాఠాలు కాదు.. ప్రాక్టికల్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. రాజకీయంగా ప్రజల్లో అభిమానం సంపాయించుకున్న నాయకులు కూడా తర్వాత పాలిటిక్స్ ప్రాక్టికల్స్‌లో పరాజయం పాలై.. ఇంటి ముఖం పట్టిన సంద ర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలే జనసేనలోనూ వినిపిస్తున్నాయి. సమున్నత లక్ష్యంతో రాజకీయా ల్లోకి వచ్చిన జనసేనాని పవన్.. తర్వాత తర్వాత జనసేనను రాజకీయ పాఠశాలగామార్చేశాడు. తనకు ఎవరెవరో ఆదర్శ మని, వారు చూపిన బాటలో నడుస్తానని లెక్చర్లు దంచాడు. అయితే, వాస్తవ పరిస్థితికి, రాజకీయాలకు మధ్య ఉన్న సన్న ని తేడాను ఆయన గుర్తించలేకపోయారనే వ్యాఖ్యలు తరచుగా వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో కామన్‌గానే అప్పటికి అది ట్రెండ్‌గానే భావించాలి. సర్దుకుపోవాలి. అయితే, పవన్ మాత్రం పిడికట్టు రాజకీయాలు చేస్తున్నాడనే వ్యాఖ్యలు తరచుగా జనసేన గూటి నుంచే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తనకు మనసులో ఒక మాట ఉంచుకుని, పైకి మాత్రం సిద్ధాంతాలు మాట్లాడుతున్నారని అంటున్నారు. మొత్తానికి పవన్ రాజకీయాలు ఆయనకేమైనా అర్ధమవుతున్నాయో లేదో కానీ పార్టీలోకి చేరదామనుకుంటున్న వారికి కూ డా అర్ధం కావడం లేదు. కొంత సేపు వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమని చెబుతూనే ఇప్పటి వరకు కూడా పార్టీ నిర్మాణాన్ని ఆయన చేపట్టలేదు. అంతేకాదు, ఎప్పుడు పవన్‌కు ఎవరు శత్రువులు అవుతారో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.పాత సంగతులు తవ్వుతూ.. జగన్‌ను ఇటీవల ఏకేశాడు పవన్. అదేసమయంలో చంద్రబాబును ఒక్కమాట కూడా మాట్లా డలేదు. వచ్చే ఎన్నికల్లో తాను ఒంటరిగానే పోటీ చేస్తానని, ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లోనూ పోటీ చేస్తానని చెప్పిన పవన్ ఈ విధమైన పంథా తీసుకోవడంపై ఆశ్చర్యం కలిగిస్తోంది. జగన్‌కు కేసీఆర్ మద్దతుగా ఎందుకు మాట్లాడారని, కేవలం చంద్రబాబును తొక్కేయడానికే ఇలా చేస్తున్నారని పవన్ వ్యాఖ్యానించాడు. అయితే, కేసీఆర్ ఓ రేంజ్‌లో తిట్టిపో శాక.. ఆయనతోనే చెలిమికి సిద్ధమైన బాబు గురించి ఒక్కమాట అనలేదు. ఓటుకు నోటు వ్యవహారంపై మాట్లాడలేదు. అంతేకాదు, రాష్ట్రానికి హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని అయినా కూడా దానినో పరాయి ప్రాంతంగా మనకు ఏమీ సంబంధం లేనట్టుగా చంద్రబాబు చూడడం, జగన్ వెళ్లి తనపై విశాఖలో జరిగిన ఘటనకు సంబంధించి అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటి పరిణామాలను రాజకీయాలకు వాడుకోవాలని చూడడం వంటివి పవన్‌కు కనిపించకపోవడంపై ఇప్పుడు విమర్శలకు అవకాశం కల్పిస్తోంది. మొత్తం ఈ ఎపిసోడ్‌లో పవన్ రాజకీయంగా ప్రాక్టికల్స్‌లోకి కూడా అడుగు పెట్టలేదని అంటున్నారు విశ్లేషకులు. మరి ఎలా ముందుకువెళ్తాడో చూడాలి.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తాము ఒంటరిగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. ఫెడరల్ ఫ్రంట్ చేరే విషయంలోనే టీఆర్ఎస్ తో చర్చించాము తప్ప ఏపీలో ఎవరితో కలిసేది లేదని వైసీపీ తేల్చి చెప్పింది. ఇక అధికార తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుందా? లేదా? అన్నది ఇంకా తేల్చలేదు. కాంగ్రెస్ పార్టీతో కలవకుండా విడిగా పోటీ చేస్తేనే మంచిదన్న అభిప్రాయం టీడీపీ నేతల్లో వ్యక్తం అవుతుంది. జగన్ పార్టీ ఓటు బ్యాంకును కాంగ్రెస్ కొంతైనా చీల్చగలదని, అందుకోసం ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి నడవకూడదని ఎక్కువ మంది తమ అధినేత చంద్రబాబును కలసినప్పుడల్లా చెప్పి వస్తున్నారు. దీనిపై చంద్రబాబు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి చెందిన అహ్మదుల్లాను పార్టీలోకి చేర్చుకోవడంపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు బలంగాకోరుకుంటుంది పవన్ తో పొత్తు ఉండాలని. అందుకే ఇటీవల పవన్ పక్కన పెట్టి జగన్,కేసీఆర్,మోదీలపైనే ఎక్కువ విమర్శలకు దిగుతున్నారు. ముగ్గురు మోదీలంటూ వారినే టార్గెట్ చేశారు. పవన్ తన వద్దకు వస్తారనిచంద్రబాబు ఇప్పటికీ నమ్ముతున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఇద్దరు పవన్,చంద్రబాబు కలయిక కసం తీవ్రప్రయత్నాలుచేస్తున్నారని తెలిసింది. పవన్ ఇటీవల యూరప్ పర్యటించినప్పుడు కూడా టీడీపీ, జనసేన పొత్తులపై చర్చలు జరిగినట్లు చెబుతున్నారు. అక్కడి నుంచివచ్చిన తర్వాతనే పవన్ తన స్వరం మార్చారని అంటున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తాను, పవన్ కలిస్తే తప్పేంటి? అన్ని ప్రశ్నించి లీకులు వదిలారు. కానీ దీనిపై పవన్ స్పందన నామమాత్రంగానే ఉండటాన్ని కూడా గమనించదగ్గ విషయం. పవన్ కూడా కేసీఆర్, జగన్ లు చంద్రబాబుపై కక్ష సాధించడానికి కలిశారన్న పవన్ వ్యాఖ్యలు ఇందుకు అద్దం పట్టే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కు సన్నిహితంగా ఉండే వారు సయితం ఒంటరిపోటీకంటే కలసి వెళ్లడమే మేలని సూచిస్తున్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో బలం లేకుండా శాసించే స్థాయికి ఎదగలేమని కొందరు పవన్ కు నచ్చ జెప్పే ప్రయత్నం చేస్తున్నారు.చంద్రబాబుకు గత ఎన్నికల్లో మద్దతిచ్చి తప్పు చేశామని పదే పదే ఇటీవల పోరాట యాత్రల్లో చెప్పిన పవన్ కల్యాణ్ చంద్రబాబుతో కలిసి వెళ్లేందుకు సుముఖంగా లేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొందరు నేతలు పవన్ కు బ్రెయిన్ వాష్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో కలసి వెళ్తే పార్టీకి శాసనసభలో ప్రాతినిధ్యం లభించడమే కాకుండా అధికారంలో కీలకంగా మారవచ్చని, ప్రస్తుత పరిస్థితుల్లో పోటీలో ఆర్థికంగా నిలదొక్కుకోవడం కూడా కష్టమేనని కొందరు గట్టిగా పవన్ కు సూచిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా ఇటీవల పార్టీలో చేరి కీలకభూమిక పోషిస్తున్న ఓ నేత టీడీపీతో జట్టుకట్టాలని వత్తిడితెస్తున్నట్లు తెలుస్తోంది. మరి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.