YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

ఇద్దరు చంద్రులు..భిన్న ధ్రువాలు

ఇద్దరు చంద్రులు..భిన్న ధ్రువాలు
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెరో రూట్ లో వెళుతున్నారు. బెంగాల్ ర్యాలీ తరువాత అమరావతిలో విపక్షాల తో ఇలాంటి కార్యక్రమమే తలపెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ ర్యాలీ తో జాతీయ రాజకీయాల్లో తన సత్తా చాటి చెప్పాలని బాబు తహతహలాడుతున్నారు. థర్డ్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ జగన్ ఏకమై జాతీయ రాజకీయాల్లో తన ముద్ర తుడిచేయాలని చూస్తున్నారన్న అంచనాలతో బాబు కేంద్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర వహించాలని వేగంగా అడుగులు వేస్తున్నారు. దేశంలో మోడీ వ్యతిరేక పార్టీలన్నీ తెలుగుదేశం వెనుకే వున్నాయన్న సందేశం ప్రజల్లోకి పంపేందుకు ఎపి సీఎం పావులు కదుపుతున్నారు. మరోపక్క అమరావతి లో అభివృద్ధి కార్యక్రమాల పేరిట సుప్రీం చీఫ్ జస్టిస్ వంటివారిని ఆహ్వానిస్తూ కీలక వ్యవస్థలోని వ్యక్తులతో టచ్ ను కంటిన్యూ చేస్తున్నారు బాబు.ఈసారి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అత్యంత భారీ యాగంతో కేంద్ర రాజకీయాల్లో తన ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నారు. సంప్రదాయాలు, ఆచారాలపై అపార నమ్మకం వున్న కెసిఆర్ శతసహస్ర మహారుద్ర చండీ యాగం తలపెట్టి దైవబలంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవాలని చూస్తున్నారు. 200 లమంది రుత్విక్ లతో తన వ్యవసాయక్షేత్రం లో కెసిఆర్ తలపెట్టిన ఈ మహా యాగంలో ప్రజలకు ప్రవేశం లేదు. మీడియాను కూడా దూరంగానే పెట్టారు. యాగం జరిగే రోజుల్లో కేవలం దేశంలోని వివిఐపిలు మాత్రమే హాజరయ్యేలా ఆహ్వానాలు వెళ్లడం విశేషం.ఈ యాగం సోమవారం ప్రారంభమై ఈనెల 25 న పూర్ణాహుతి తో పూర్తి కానుంది. ఆ తరువాత కెసిఆర్ జాతీయ రాజకీయాలపై పూర్తి స్థాయిలో యాక్టివ్ కానున్నారు. ఇలా తెలుగు సిఎం లు తమదైన శైలిలో జాతీయ రాజకీయాల్లో పట్టుకోసం ఎవరి రూట్ లో వారు నడుస్తున్నారు. నెంబర్ గేమ్ రాజకీయాల్లో అత్యధిక పార్లమెంట్ సీట్లు తమ రాష్ట్రాల్లో దక్కించుకోవడమే వీరి లక్ష్యం. అయితే ఇందులో ఎవరు ఎంత సక్సెస్ అవుతారో వచ్చే ఎన్నికలే తేల్చి చెప్పనున్నాయి.

Related Posts