YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చిత్తూరు జిల్లాల్లో 52 కొనుగోలు కేంద్రాలు

 చిత్తూరు జిల్లాల్లో 52 కొనుగోలు కేంద్రాలు
రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ధాన్యం కొనుగోలులో దళారీల ప్రమేయానికి అడ్డుకట్ట వేసి.. పంట ఉత్పత్తికి మద్దతు ధరతో ఆర్థిక భరోసా కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా 52 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కొనుగోళ్లు ప్రారంభించేందుకు పౌరసరఫరాల సంస్థ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.సింగిల్‌ విండోలు, మండల వెలుగు సమాఖ్యల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేయనున్నారు.. వీటి నిర్వహణపై అధికారులు, సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. అవసరమైన సామగ్రి.. కరపత్రాలు పంపిణీ చేశారు.ధాన్యం సేకరించిన రెండ్రోజుల్లోగా ధరావతు సొమ్ము రైతుల బ్యాంకు ఖాతాలకు జమ కానుంది. సరైన నాణ్యత ప్రమాణాలు ఉన్న ధాన్యాన్నే కొనుగోలు చేస్తారు. రైతులు తమ బ్యాంకు పాసుపుస్తకం, ఆధార్‌ నంబరు, పట్టాదారు పాసుపుస్తకాన్ని కొనుగోలు కేంద్రం అధికారులకు సమర్పించాలి. ధాన్యాన్ని తరలించే టప్పుడు నిర్ణీత నాణ్యత ప్రమాణాలను పాటించాలని పౌరసరఫరాల శాఖ అధికారులు సహకార పరపతి, వెలుగు అధికారులను ఆదేశించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2018-19కుగాను.. నిర్ణీత నాణ్యత ప్రమాణాలు ఉన్న ధాన్యానికి కనీస మద్దతు ధర ప్రకటించింది. సాధారణ రకం ధాన్యం క్వింటాల్‌ రూ.1730, గ్రేడు-ఏ రకం రూ.1770గా నిర్ణయిం చింది. గ్రేడ్‌-ఏ రకాలు ఎంటీయు.1010, ఎన్‌ఎల్‌ఆర్‌.145, ఎన్‌ఎల్‌ఆర్‌.3049, బీపీటీ 5204, తెల్లహంస తదితర రకాలను సన్న రకాలుగా.. ఎంటీయు, ఏడీటీ-37, ఏడీటీ.39, ఏడీటీ.43 తదితర రకాలను సాధారణ రకాలుగా నిర్ధారించారు.వరి సాగు విస్తీర్ణానికి అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా 52 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి వాటిని ప్రారంభించనున్నారు. గతేడాది ఖరీఫ్‌, రబీ సీజన్లకు సంబంధించి 86వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ ఏడాది 61వేల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించారు. ప్రాథమిక సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో 29, వెలుగు సమాఖ్యల నిర్వహణలో 22 కేంద్రాలను ప్రారంభించనున్నారు. యాదమరి, పెనుమూరు, వెదురుకుప్పం, ఆర్‌సీపురం, నగరి, నిండ్ర, పూతలపట్టు, విజయపురం, గంగాధరనెల్లూరు, కలికిరి, వరదయ్యపాళ్యం, నాగలాపురం, పిచ్చాటూరు, శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు, కేవీబీపురం, బీఎన్‌కండ్రిగ, చంద్రగిరి, రేణిగుంట, వి.కోట, శాంతిపురం, ఎర్రావారిపాళ్యం.చిత్తూరు, గుడిపాల, బంగారుపాళ్యం, తవణంపల్లె, ఐరాల, పుత్తూరు, వెదురుకుప్పం, కార్వేటినగరం, వడమాలపేట, ఆర్‌సీపురం, నారాయణవనం, నగరి, పాలసముద్రం, గంగాధరనెల్లూరు, వాల్మీకిపురం, చిన్నగొట్టిగల్లు, సోమల, సత్యవేడు, వరదయ్యపాళ్యం, నాగలాపురం, పిచ్చాటూరు, శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు, కేవీబీపురం, పాకాల, తిరుపతి, రేణిగుంట, ఎస్‌ఆర్‌పురంలలో ఏర్పాటు చేశారు. 

Related Posts