YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రజల మధ్యల చిచ్చు పెడుతున్నారు

ప్రజల మధ్యల చిచ్చు పెడుతున్నారు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. సోమవారం అయన చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడారు.  తెలంగాణా, ఏపి మధ్య విభేదాలు సృష్ఠిస్తున్నారు. తెలుగుజాతీని విచ్ఛిన్నం చేయాలని మోడీ కుట్ర చేస్తున్నారు. కలకత్తాలో జరిగిన ర్యాలీకి 22 పార్టీలు నేతలు హాజరయ్యారు. కలకత్తాలో ర్యాలీని చూసిన తర్వాత మోడీకి ఇంటి భయం పట్టుకుందని అన్నారు. కుట్ర రాజకీయాలు చేసే మోడీ ఈ దేశానికి అనర్హుడనే నిర్ణయానికి ప్రజలు వచ్చారు. మోడీకి ప్రచారం ఎక్కువ అభివృద్ధి తక్కువ. ఎరువులు, గ్యాస్, పెట్రోలు, డీజిల్ అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులకు గురవ్వుతున్నారు. సీఎం ధర్మ పోరాట దీక్షలు ద్వారా మోడీ కుట్రలు, కుతంత్రాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. జగన్ విధానాలు నచ్చకే వంగవీటి రాధా బయటకు వచ్చారు. వంగవీటి రాధా తెదేపాలోకి వస్తే తప్పక ఆహ్వానిస్తారని అనర్నారు. వంగవీటి రాధా తెదేపాలో చేరికపై సీఎం నిర్ణయం తీసుకుంటారు. జగన్ విధానాలు నచ్చక చాలా మంది నాయకులు బయటకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే వారు ఏవరు కూడా వైకాపాలో ఉండరని  మంత్రి  అన్నారు. జగన్ విధేవింగా కొనసాగితే 2019 ఆ పార్టీకి అడ్రస్సు కూడా గల్లంతు అవుతుంది. చంద్రబాబు అభివృద్ధి చూసి వైకాపా పార్టీ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయని అయన అన్నారు. 

Related Posts