Highlights
- శోకసంద్రంలో చిత్ర పరిశ్రమ
- 1956 అక్టోబర్ 10 న విజయవాడలో జననం
- 18 ఏళ్ల వయస్సులోనే నాటక రంగం ప్రవేశం
- జన్మస్థలం విజయవాడ.. తొలి చిత్రం.
- అమృతంతో కొత్త ప్రయాణం
ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంత రావు(61) కొంత కాలంగా ఆర్థిక సమస్యలతో దుర్భర జీవితం గడుపుతున్నట్లు తెలుస్తోంది. అదే క్రమంలో ఆయన అనారోగ్యంతో భాదపడుతున్నారు. ఈ తెల్లవారు జామున హనుమంత రావు మృతి చెండంతో ఆయన తో నటించిన నటీనటులు, చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.
జన్మస్థలం విజయవాడ.. తొలి చిత్రం.. ముందు హనుమంత రావు 1956 అక్టోబర్ 10 న విజయవాడలో జన్మించారు. నాటకాలపై ఆసక్తితో ఆయన 18 ఏళ్ల వయస్సులోనే నాటక రంగం ప్రవేశం చేశారు. ఓ నాటకంలో దర్శకులు జంధ్యాల గుండు హనుమంత రావు నటనకు మెచ్చి ఆయనకు అహనా పెళ్లంట చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఆహనాపెళ్ళంట చిత్రం ఆల్ టైం కామెడీ ఎంటర్ టైనర్ గా నిలిచిన సంగతి తెలిసింది. ఆ తరువాత వరుసగా హనుమంత రావుని అవకాశాలు పలకరించాయి.
దశాబ్దాల కాలం పాటు ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్నారు. గత కొంత కాలంగా హనుమంత రావు అనారోగ్యంతో భాదపడుతున్న సంగతి తెలిసిందే. హనుమంత రావు హాస్య నటుడిగా దాదాపు 400 పైగా చిత్రాల్లో నటించారు. యమలీల, పేకాట పాపారావు, ప్రేమ వంటి చిత్రాల్లో హనుమంత రావు నటించారు. ముఖ్యంగా 90 లలో ఆయన ఎక్కువ చిత్రాల్లో నటించారు.ఆ సినిమాలతో గుర్తింపు హనుమంత రావు 80 వ దశకంలోనే చిత్ర పరిశ్రమకు వచ్చారు. యమలీల, పేకాట పాపారావు, ఘటోత్కచుడు, రాజేంద్రుడు గజేంద్రుడు వంటి చిత్రాల ద్వారా హాస్య నటుడిగా మంచి గుర్తింపుతెచ్చుకున్నారు. అమృతంతో కొత్త ప్రయాణం సినీ అవకాశాలు తగ్గిన కమ్రంలో ఆయన అమృతం సీరియల్ ద్వారా కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టారు. అమృతం సీరియల్ బుల్లి తెరపై నవ్వులు పూయించింది.